బయ్యర్స్ ను భయపెడుతోన్న మహేష్ బాబు

0
168
సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. కానీ రేంజ్ మారేది మాత్రం లాభాలు వచ్చినప్పుడే. ఓ భారీ బడ్జెట్ సినిమా తీసి ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించినప్పటి కంటే ఓ సాధారణ బడ్జెట్ లో సినిమా తీసి అసాధారణ కలెక్షన్స్ సాధించినప్పుడు వచ్చే రేంజ్ చాలా పెద్దది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద ఇప్పుడు మహేష్ బాబు మహర్షి పేరు చెబితే బయ్యర్లు భయపడుతున్నారట. అందుకు కారణం బడ్జెట్ మాత్రమే అనేది లేటెస్ట్ న్యూస్.. సూపర్ స్టార్ లాస్ట్ మూవీ భరత్ అనేనేనుకు దాదాపు 80కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. కాకపోతే అప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో బయ్యర్స్ నష్టాలు చూశారు ఈ మూవీపై. మరికొందరు బార్డర్ లో గట్టెక్కిపోయారు. బట్ ఇప్పుడు గతంలో వచ్చిన లాభాల స్థాయిలోనే సినిమా బడ్జెట్ ఉందట. యస్.. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి.. ఈ మూవీ బడ్జెట్ 130 కోట్ల వరకూ ఉందట. తర్వాత ప్రమోషన్స్ అనీ.. అదనీ ఇంకా పది కోట్ల వరకూ అయ్యే అవకాశం ఉందట.
సో.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు లాభాలు రావాలంటే కనీసం150 కోట్లకు అమ్మాలి. అలా చూసినా లాభాల శాతం చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఏరియాల వారీగా చూస్తే మహేష్ బాబు సినిమాలకు ఈ రేంజ్ లో ఎవరూ కొనలేదు. అంతకు చాలా తక్కువకు కొన్నవాళ్లు కూడా లాభాలు చూడలేదు. దీంతో ఇప్పుడు వీళ్లు చెబుతోన్న రేట్స్ వింటేనే బయర్స్ వణికిపోతున్నట్టు సమాచారం. అందువల్ల సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. దీనికి తోడు ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇలా పోస్ట్ పోన్ అయిన సినిమాలు పెద్దగా ఆడవు అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది కదా..?
కాకపోతే ఈ సినిమాకు అంత బడ్జెట్ కావడానికి కారణం దర్శకుడు అని నిర్మాతలు.. నిర్మాతలే అని దర్శకుడు ఆరోపించుకుంటున్నారట. నిజానికి మహర్షికి రీ షూట్స్ కూడా బాగానే అయ్యాయట.. అందుకే ఈ బడ్జెట్ అనేది ఇంకొందరు చెబుతోన్న మాట. ఎవరేం చెప్పినా.. అంతిమంగా వీళ్లు చెప్పిన రేట్ కు కొనేందుకు మాత్రం బయ్యర్స్ ఎవరూ సిద్ధంగా లేరట.