‘మా’గోల మాకేలా..?

0
2824
నరేష్.. సీనియర్ నటుడుగా ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి. శివాజీరాజా కూడా. కానీ నరేష్ లా అతనికి బ్యాక్ గ్రౌండ్ లేదు. అలాగే హీరో కాదు. కాకపోతే కొన్నాళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. ‘మా’లో కీలకంగా ఉంటున్నాడు. ఇటు నరేష్ కూడా మా లో కీలకమైన పదవిలో ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం వీరి మధ్య డబ్బుల పంచాయితీ వచ్చింది. అది ఈ సారి తీవ్రమైన పోటీవాతావరణంలో ఎన్నికలకు దారి తీసింది. అంతా ఊహించినట్టుగా కాకుండా అనూహ్యంగా నరేష్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజం. కానీ నరేష్ ఇందుకు అతీతంగా ప్రవర్తిస్తున్నట్టు అప్పుడే ఆరోపణలు రావడం ఆశ్చర్యం. మామూలుగానే కాస్త ఓవర్ చేసే నైజం ఉన్న వ్యక్తి నరేష్. మైక్ దొరికితే వదలడు అని మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక ఎలక్షన్స్ లో గెలిచాక అతని ఉపన్యాసాలు చూసి అరె ఇతను గెలిచింది ఓ సాధారణ ప్రైవేట్ ఎలక్షన్. కానీ మా ప్రెసిడెంట్ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడనే అనుకోని వారు ఉండరు. కావాలంటే నరేష్ స్పీచ్ ల వెనక యూట్యూబ్ లోని కమెంట్స్ చూస్తే తెలుస్తుంది.
ఇక మా ప్రమాణస్వీకారమహోత్సవం అంటూ ఓ భారీ ఉత్సవాన్ని కూడా నిర్వహించిన నరేష్.. ఇండస్ట్రీలోని పెద్దలను పిలిచాడు. కానీ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కనిపించలేదు. అటు నాగ్ అండ్ టీమ్ కూడా లేదు. బాలయ్య వైపు నుంచీ ఎవరూ లేరు. కేవలం కృష్ణగారి ఫ్యామిలీతో పాటు బాలసుబ్రహ్మణ్యం కొందరు సీనియర్ ఆర్టిస్టులు మాత్రం కనిపించారు. మరి నరేష్ పిలవలేదా.. లేక వాళ్లే లైట్ తీసుకున్నారా అనేది తెలియాలి. ఇక ఆ వేదిక ఆసాంతం నరేష్ చేసిన అతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ దశలో హేమ నుంచి మైక్ లాగేసుకున్నాడు. ఇటు జీవిత అండ్ రాజశేఖర్ కూడా ఇంకా పూర్తి స్తాయిలో వర్కింగ్ లోకి రాని కమిటీలో నరేష్ పై కొన్ని ఆరోపణలు చేశారు.

ఇక సీనియర్స్ అయితే ‘మా’ గుట్టు రట్టు కాకుండా చూడాలని సూచించారు. బట్.. అదే వేదికపై నరేష్ చేసిన ఓవరాక్షన్ చూస్తే ‘మా’పై రోజుకు రోజురోజుకు సాధారణ జనాల్లో చీప్ లుక్ ఏర్పడుతుంది. దీంతో ‘మా’ గోల మాకేల అంటూ మరికొందరు ఓపెన్ గానే సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా వెండితెర నటులకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి వారంతా కలిసి ఓ సంఘం పెట్టుకున్నారనీ.. దానికి ఎన్నికలుంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ ఎన్నికలు కూడా ఊళ్లల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లా చీప్ గా మారిపోవడం మాత్రం చాలామంది సినీ పెద్దలకు మింగుడు పడని విషయంగా మారింది. మరి ఇకనైనా మీరు గెలిచింది ‘మా’ ఎలక్షన్స్ మాత్రమే అని గుర్తుపెట్టుకుని చేసిన వాగ్ధానాలు నెరవేర్చే దిశాగా అడుగులు వేస్తే మంచిదంటున్నారు. అలాగే ప్రతిదానికీ మీడియా సమావేశం పెట్టి ఎవరికి వారు గాలి తీసుకుంటే ఆఖరికి ‘మా’ పరువు పోతుందని సీనియర్స్ వాపోతున్నారు. ఏదేమైనా ఈ విషయంలో సీనియర్స్ కొత్త ప్యానెల్ ను కొంత కంట్రోల్ లో పెడితే మంచిదనే మాటలు వినిపిస్తున్నాయి..