Tuesday, August 20, 2019
Home News Entertainment news చిరంజీవిపై చిరాకు పడుతోన్న దర్శకుడు

చిరంజీవిపై చిరాకు పడుతోన్న దర్శకుడు

0
2662
మెగాస్టార్ చిరంజీవిపై చిరాకు పడేంత దమ్మున్న దర్శకుడెవరు అనుకుంటున్నారా..? ఆ విషయం పక్కన బెడితే.. ఈ వార్త మాత్రం నిజమే అంటోంది టాలీవుడ్. ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో  బిజీగా ఉన్నాడు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా ఇది. రామ్ చరణ్ నిర్మిస్తోన్న సైరాను మోస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముందు నుంచీ సజావుగా సాగడం లేదు. అనుకున్న టైమ్ కు ప్రతిసారీ లేట్ అవుతూనే ఉంది. లేదంటే ఇప్పటికే సైరా షూటింగ్ పూర్తయి ఉండాలి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండాలి. కానీ అలా జరగలేదు. ఇదే ఇప్పుడు మరో దర్శకుడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
మరి ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. మెగాస్టార్ కోసమే చాలాకాలంగా ఖాళీగా ఉన్న కొరటాల శివ. మహేష్ బాబుతో గతేడాది మేలో భరత్ అనేనేను తీసి హిట్ కొట్టిన కొరటాల ఇప్పటి వరకూ కేవలం చిరంజీవితో సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ గతేడాది చివర్లోనే పూర్తి కావాలి. బట్ కాలేదు. పైగా ఈ యేడాది మూడు నెలలవుతోన్నా ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో యేడాది క్రితమే కథ రెడీ చేసుకున్న కొరటాల శివ అనవసరంగా ఇన్నాళ్లూ వేస్ట్ చేశానా అని చిరాకు పడుతున్నాడట. పైకి ఇవన్నీ చెప్పరు కదా. కానీ కొరటాల మాత్రం అనవసరంగా ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యానే భావనలో ఉన్నాడట. కానీ ఆ మాట అనలేడు కదా. అయినా అతని చిరాకు ఇంకో మూడు నెలల వరకూ ఉంటుందని సమాచారం. అంటే సైరా సినిమా ఈ యేడాది జూన్ వరకూ సాగుతూనే ఉంటుందట. సో.. కొరటాలకు అప్పటికి కానీ ఛాన్స్ రాదు.. మరి కొరటాల చిరాకుపై మెగా క్యాంప్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here