‘Kobbari Matta’ Movie Review

0
809

అప్పటి వరకు వేరే హీరో లపై ఉన్న దృష్టి ని హృదయ కాలేయం సినిమాతో సడన్ గా తన వైపు తిప్పుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ‘కొబ్బరిమట్ట’ పేరుతో మరోసారి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉందొ సమీక్ష లో తెలుసుకుందాం.

రాయుడు(సంపూర్ణేష్ బాబు) తన గ్రామ పెద్దగా, తన ఊరి ప్రజలకు పెద్ద దిక్కుగా, తన ముగ్గురు భార్యలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అలాంటి రాయుడు జీవితం యాండ్రాయుడు(సంపూర్ణేష్ బాబు) రాకతో ఒడిదుడుకులకు లోనవుతుంది. అసలు ఎవరు ఈ యాండ్రాయుడు? అతనికి రాయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.

సంపూ బర్నింగ్ స్టామినా ని దృష్టిలో పెట్టుకుని అల్లిన కొబ్బరిమట్టలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు  పాత్రల్లో సంపూ పెద్ద అరాచకాన్నే క్రియేట్ చేసాడు. వన్ మాన్ షో గా సంపూ ప్రతి ప్రేక్షకుడితో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఎప్పటిలానే తన మార్క్ డాన్స్, ఫైట్స్ తో కడుపుబ్బా నవ్వించాడు. అతనికి భార్యలుగా నటించిన ముగ్గురూ.. గాయత్రి గుప్తా, ఇషికా సింగ్, గీతాంజలి కామెడీలో భాగం అయ్యారు. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది షకీలా (పండు), కాముడు (కత్తి మహేష్) పాత్ర గురించి. ఈ ఇద్దరూ భార్య భర్తలుగా నటించి కామెడీ పీక్స్ కి చేరేలా చేశారు. చాలా రోజుల తరువాత షకీలాకు తెలుగులో ఓ మంచి పాత్ర పడింది. ఆండ్రాయిడ్ ఎంట్రీ తరువాత ఈ రెండు పాత్రలకు ప్రాధాన్యత పెరిగింది. కత్తి మహేష్ ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా కామెడీగా వాడేశాడు దర్శకుడు రొనాల్డ్ సన్.
దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మూవీ అక్కట్టుకొనేలా తీయడంలో ఎంత కష్టపడ్డారో తెరపై కనిపిస్తుంది. కథలో కానీ సన్నివేశాలలో కానీ ఎటువంటి లాజిక్ లేకపోయినప్పటికీ తాను అనుకున్న విధంగా సంపూర్ణేష్ తో తెరపై హాస్యం పండించడంలో విజయం సాధించారు అని చెప్పొచ్చు. కాకపోతే అవి సిల్లీ గా లాజిక్ లేకుండా అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా నవ్వించేలా ఉన్నాయి. హై పిచ్ లో వచ్చే అన్ని పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త  మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి మించేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: 
సంపూ
కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్: సంపూ మరోసారి నవ్వించేసాడు

ఫిల్మ్ జల్సా రేటింగ్ :3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here