అక్కినేని హీరోతో కియారా అద్వానీ రొమాన్సా..?

0
2842
కియారా అద్వానీ.. భరత్ అనేనేనుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ. ఫస్ట్ మూవీలో చూసినప్పుడే తనను అంతా తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కాన అమ్మడికి కేవలం తెలుగులోనే టాప్ లేపాలని లేదు. అటు బాలీవుడ్ ను సైతం దున్నేయాలనుకుంది. అందుకే ఆచితూచి అడుగులు వేసింది. కానీ సెకండ్ స్టెప్పే తడబడింది. రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ లో మంచి ఆఫర్ అనుకున్నారు. బట్ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కియారాకు షాక్ తప్పలేదు. బోయపాటిని నమ్ముకుని బోల్తా పడ్డ ఈ భామ అటు బాలీవుడ్ లో మాత్రం సెమీ అడల్ట్ సినిమాలు కూడా చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తోంది కియారా. అంటే అర్జున్ రెడ్డిలోలాగా అధర చుంబనాలకు ఓకే చెప్పినట్టే కదా..
ప్రస్తుతం కియారా హిందీలోనే నాలుగు సినిమాలు చేస్తోంది. వీటిలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో పాటు కళంక్, గుడ్ న్యూస్, పృథ్విరాజ్ చౌహాన్. సో తెలుగులో ఇంత వరకూ కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదన్నమాట. అయితే లేటెస్ట్ గా తనను ఓ తెలుగు సినిమాలో తీసుకునేందుకు అల్లు అరవింద్ అండ్ క్యాంప్ ట్రై చేస్తున్నట్టు టాక్. అల్లు అరవింద్ నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమా కోసం కియారాను తీసుకోవాలనుకుంటున్నారట. అక్కినేని అఖిల్ నటిస్తోన్న నాలుగో సినిమా ఇది.
అఖిల్ చేసిన మూడు సినిమాలూ అతనికి ఊహించిన రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో గీతా ఆర్ట్స్ లో చేస్తోన్న ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీలో నిజంగానే కియారా అద్వానీ నటిస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ కు మరింత హైప్ వస్తుంది. పైగా తను అప్పటికే కబీర్ సింగ్ లో నటించి ఉంటుంది కాబట్టి.. ఆ రేంజ్ గ్లామర్ ఎక్స్ పెక్ట్ చేస్తే హిందీ మార్కెట్ కూడా పెరుగుతుంది..