రజినీకాంత్ సరసన కీర్తి సురేష్…?

0
1122
ఏంటీ రాంగ్ టైటిల్ పెట్టారు అనుకుంటున్నారా..? అదేం లేదు. మీరు చదివింది కరెక్టే. ఈ మధ్య తనకంటే చాలా ఎక్కువ ఏజ్ ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తోంది కీర్తి సురేష్. రీసెంట్ గా విక్రమ్ తో కూడా రొమాన్స్ చేసింది కదా. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. పైగా తన చేతిలో ఒప్పుడు ఒక్క తమిళ్ సినిమా కూడా లేదు. ఈ మధ్య తెలుగులో ఓ సినిమా కమిట్ అయింది. అది తప్ప మరో సినిమా లేదు. అలాంటప్పుడు రజినీకాంత్ సరసన ఆఫర్ వస్తే ఎలా కాదనుకుంటుంది. అందుకే ఒప్పుకుందని అంటున్నారు. అన్నట్టు ఈ మూవీకి కమిట్ కావడానికి ఒక్క సూపర్ స్టార్ మాత్రమే కాదు.. దర్శకుడు కూడా ఓ రీజన్.

లేటెస్ట్ గా పేటా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్ నెక్ట్స్ మూవీ మరో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో చేస్తన్నాడు. ఈ సినిమాలో రజినీ రెగ్యులర్ స్టైల్స్ కంటే నేటి పొలిటికల్ సిస్టమ్ పై సెటైర్ గా ఉంటుందని చెబుతున్నారు. పైగా త్వరలోనే రజినీ పొలిటికల్ ఎంట్రీ ఉంది. అందుకు తగ్గట్టుగానే కథనం కూడా ఉంటుందని సమాచారం. మరి ఇలాంటి టైమ్ లో వస్తోన్న పొలిటికల్ మూవీ ఎంత హీట్ పుట్టిస్తుందో వేరే చెప్పాలా. అలాంటి హీటెక్కించే మూవీలో ఉంటే కీర్తికీ లాభమే కదా.. మొత్తంగా కీర్తి సురేష్ తనకంటే 42యేళ్లు పెద్దవాడైన రజినీకాంత్ సరసన నటిస్తోంది. అయితే ఆయన సరసన నటిస్తోందా.. ఆయన సినిమాలో నటిస్తోందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

మరో విశేషం ఏంటంటే.. కీర్తి సురేష్ తల్లి మేనక గతంలో రజినీకాంత్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పేరు ‘నెట్రికన్ను’. ఇక ఈ మురుగదాస్ సినిమాకు ‘నర్కాళి’ అనే టైటిల్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ తమ సినిమా టైటిల్ అది కాదని ఖండించాడు దర్శకుడు మురుగదాస్. ఏదేమైనా కీర్తి సురేష్ నిర్ణయం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here