‘Kathanam’ Movie Review

0
822

బుల్లితెర యాంకర్ గానే కాకుండా క్షణం, రంగస్థలం లాంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా అనసూయ ఇప్పుడు ‘కథనం’ సినిమా తో మరోసారి ప్రేక్షకులని పలకరించింది. మరి ఈ సినిమా అనసూయ గ్రాఫ్ ని మరింత పెంచిందా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం.

అను(అనసూయ భరద్వాజ్‌) సినిమా పరిశ్రమలో రచయితగా కథలు రాస్తూ.. డైరెక్షన్‌ చాన్స్‌ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ నలుగురు నిర్మాతల దగ్గర ఉన్న కథను డెవలప్‌ చేసి వారిని మెప్పిస్తుంది. ఆ చిత్రానికి అనసూయను దర్శకత్వ బాధ్యతలు చేపట్టి.. మిగతా స్క్రిప్ట్‌ వర్క్‌ చేయమని సలహా ఇస్తారు నిర్మాతలు. అయితే ఆ కథకు సంబంధించిన కథనాన్ని ఎలా రాసుకుంటుందో.. నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ హత్యలు చేసేది ఎవరు? దీనికి వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ.

అను పాత్రలో అనసూయ లుక్స్‌ పరంగానే కాకుండా నటిగా కూడా ప్రేక్షకులను మెప్పించింది. అరవిందమ్మ పాత్రలో కూడా అనసూయ తన హుందాతనాన్ని చాటుకుంది. సెకండాఫ్‌లో సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్‌లోనూ చక్కగా నటించింది. అనసూయకు వెన్నంటే ఉండి సహాయం చేసే స్నేహితుడి పాత్రలో ధనరాజ్‌, పోలీస్‌ పాత్రలో రణధీర్‌ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
కథనం అని సినిమాకి పేరు అయితే పెట్టారు కానీ సినిమా కథనాన్ని మాత్రం సరిగా నడిపించలేకపోయాడు దర్శకుడు. కథ కూడా కొత్తది కాకపోవడంతో సినిమాకి చాలా మైనస్ అయింది. అనవసరమైన సన్నివేశాలు, ఇరికించినట్లు అనిపించే కామెడి.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.సినిమాటోగ్రఫీ పర్లేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం అవసరానికి మించి ఉందనిపిస్తుంది. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టుగా ఉన్నాయి

ప్లస్ పాయింట్స్:
అనసూయ నటన
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:
స్టోరీ, స్క్రీన్ ప్లే
కామెడీ పండకపోవడం

పంచ్ లైన్: కథనం మిస్ అయింది

ఫిల్మ్ జల్సా రేటింగ్ : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here