దొర‌సాని లో జాన‌ప‌ద ఊపు

0
796
ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక హీరో హీరోయిన్లుగా కెవీఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘దొర‌సాని’. జులై 12న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్, ఇప్పటి వ‌ర‌కు విడుద‌లైన పాటల‌న్నీ సినిమాపై ఆస‌క్తిని పెంచేలానే ఉన్నాయి. సినిమా రిలీజ్ కు చాలా త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌టంతో దొర‌సాని టీమ్ ప్ర‌మోష‌న్స్ జోరు బాగా పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి క‌ప్ప‌త‌ల్లి క‌ప్ప‌త‌ల్లి అంటూ వ‌చ్చే ఒక లిరిక‌ల్ సాంగ్ విడుదలైంది.
ప్ర‌ముఖ జాన‌ప‌ద గీత ర‌చ‌యిత, గాయ‌కుడు గోరేటి వెంక‌న్న సాహిత్యం అందించిన ఈ పాట చాలా స‌ర‌ళ‌మైన తెలంగాణ ప‌దాల‌తో ఫోక్ స్టైల్ లో ఉంది. ఇక పాట కూడా మంచి ఫోక్ స్టైల్ లో ఎంత జోష్ గా ఉందో, అంతే జోష్ తో పాట‌ను పాడాడు సింగ‌ర్ అనురాగ్ కులక‌ర్ణి. ”షిట‌ప‌ట షిట‌ప‌ట షినుకుల తాళం నింగిని వంపిన సింగిడి బాణం, మ‌త్త‌డి దునికిన పొంగుల హారం” అంటూ చాలా విన‌సొంపుగా ఉంది పాట‌. వెనుక‌టి రోజుల్లో వ‌ర్షాలు కుర‌వాల‌ని వాన‌లను ఆహ్వానిస్తూ క‌ప్ప‌ల‌కు పెళ్లి చేసేవారు. ఆ థీమ్ కు స‌రిప‌డేలా ఉంది ఈ పాట‌. పిల్ల‌లంద‌రూ క‌ప్ప గెంతులేస్తుంటే మేడ‌మీద నుంచి దొర‌సాని ఆ సంద‌డిని చూస్తుండ‌గా, ఆ పిల్ల‌ల ప‌క్క‌నున్న హీరో దొరసాని వైపు చూస్తూ త‌న ప్రేమ‌ను ఫీల‌వుతూ ఉంటాడన్న‌మాట‌. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు దొరసానికి సంబంధించి విడుద‌లైన అన్నీ పాటలు, టీజ‌ర్స్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉండి, సినిమా మీద అంచ‌నాలు పెంచుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here