కాంచన-3: డ‌బుల్ మాస్ హ‌ర్ర‌ర్….!

0
331
లారెన్స్ కు దర్శకుడిగా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన కాంచన సిరీస్ లో మూడో భాగం వస్తోంది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఇంతకుముందు తమిళంలో తెరకెక్కిన హారర్ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగులోను ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. తాజాగా లారెన్స్ కు దర్శకుడిగా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన కాంచన సిరీస్ లో భాగంగా కాంచ‌న‌-3 ట్రైల‌ర్ ను రీలీజ్ చేశారు.
సస్పెన్స్ .. హారర్ .. యాక్షన్ సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. వైట్ అండ్ వైట్ పంచె కట్టులో తెల్లని గెడ్డం జుట్టుతో వయసు మళ్ళిన పాత్రలో కాస్త డిఫరెంట్ లారెన్స్ కొత్తగా కనిపిస్తున్నాడు.. వేదిక హీరోయిన్ గా నటించిన కాంచన 3 లో ఓవియా కీలక పాత్ర పోషించింది. కాంచన ఫస్ట్ సిరీస్ లాగే ఇందులోనూ లారెన్స్ డ్యూయల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్ కనిపిస్తున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్య సీన్స్ వుంటాయనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

ఇంతకు ముందు వచ్చిన వాటికంటే ఇందులో భయానక అంశాలు కాస్త ఎక్కువ జోడించారు. ఓ బంగాళాలో దెయ్యం ఉండటం దానికో ఫ్లాష్ బ్యాక్ అందులో లారెన్స్ కీలక పాత్ర వహించడం ఇదంతా అదే ఫార్ములాలోనే సాగింది. అయితే వ్యత్యాసం మొత్తం లారెన్స్ గెటప్ లో చూపించారు.కోవై సరళ-మనోబాల-సూరి-శ్రీమాన్ తదితరులు రెగ్యులర్ గా కనిపించే వేషాల్లోనే ఉన్నారు. విలన్ గా కబీర్ కొత్త ఆకర్షణ. ఆమ్రేష్ గణేష్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ కావడంతో నిర్మాణం కాస్త రిచ్ గా ఉంది. ఇంట్లోకి పదుల సంఖ్యలో కొమ్ములు తిరిగిన ఎద్దులు రావడం రౌడీలను గాల్లో ఎగరేసి ఒకొక్కరిని ముసలాడిగా ఉన్న లారెన్స్ చితకొట్టడం లాంటి మాస్ మసాలాలు చాలానే ఉన్నాయి. చివర్లో లారెన్స్ డైలాగ్ నేను డబుల్ మాస్ అని చెప్పించడం చూస్తే హారర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది