విడుదలకి ముస్తాబవుతోన్న ‘జెర్సీ’

0
303
నాని కథానాయకుడిగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ నిర్మితమైంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది.
నాని ఈ సినిమాలో క్రికెటర్ ‘అర్జున్’ గా కనిపించనున్నాడు. ప్రేమ .. కుటుంబం .. బంధాలు .. పరిస్థితులు .. ఆశయం .. ఇలా బలమైన ఎమోషన్స్ తో ఈ కథ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే కంటెంట్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాని ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.