ఇస్మార్ట్ డే1 క‌లెక్ష‌న్స్ ..

0
864
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, అవేమీ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపలేదు. ఇస్మార్ట్ టీమ్ ప్ర‌మోష‌న్స్, కాంట్ర‌వ‌ర్సీలు ఈ సినిమాకి కలిసొచ్చాయి. డే-1, వీకెండ్ క‌లెక్ష‌న్స్ కు ఎటువంటి లోటు లేదని ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తేనే అర్థమైంది. ఇక ఈ సినిమాకి మాస్ ఆదరణ బావుండడం కలిసొస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఒక టైర్-2 హీరో సినిమా కు రావాల్సిన డే1 క‌లెక్ష‌న్స్ కంటే ఇస్మార్ట్ శంక‌ర్ క‌లెక్ష‌న్స్ చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. నైజాం-3.10 కోట్లు.. సీడెడ్-1.20 కోట్లు.. వైజాగ్-85లక్షలు.. గుంటూరు- 57లక్షలు .. తూ.గో జిల్లా- 50లక్షలు.. ప.గో జిల్లా- 40లక్షలు.. కృష్ణ -52లక్షలు .. నెల్లూరు- 30లక్షలు.. యూఏ-86లక్షలు వసూలైంది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 7.44కోట్లు వసూలైంది. రామ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని ఇస్మార్ట్ టీమ్ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here