Wednesday, October 16, 2019
Home News Entertainment news ఈ డేట్ అయినా కరెక్టేనా మహేషా..?

ఈ డేట్ అయినా కరెక్టేనా మహేషా..?

0
2513
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి మళ్లీ వాయిదా పడింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. యూఎస్ తో పాటు ఇండియా బ్యాక్ గ్రౌండ్ లోనూ సాగే ఈ సినిమాలో మహేష్ బాబు రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడని చెప్పారు. చూపించారు కూడా. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ మొదలైన టైమ్ లోనే ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆ డేట్ మారింది. ఇంకా కావాల్సిన షూటింగ్ చాలా ఉన్నందున ఏప్రిల్ 25న అన్నారు. పోనీ ఆ రోజైనా వస్తుందిలే అనుకున్న ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చింది ఈ మూవీ టీమ్.
నిజానికి మహర్షి ఏప్రిల్ 25న విడుదల అన్నప్పుడే చాలామంది అప్పుడు కూడా రావడం కష్టం. ఇక జూన్ లోనే విడుదల అని రూమర్స్ చేశారు. ఆ రూమర్స్ ను మూవీ టీమ్ ఖండించింది. ఖచ్చితంగా ఏప్రిల్ 25న వస్తామని మరోసారి డిక్లేర్ చేశారు. బట్ మళ్లీ మాట తప్పింది మహర్షి టీమ్. కాకపోతే మరీ జూన్ వరకూ కాకుండా మే 9న విడుదల చేస్తామని లేటెస్ట్ గా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. అంటే ముందు చెప్పిన డేట్ కంటే దాదాపు నెల రోజులు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వస్తాడు మహర్షి.

ఇప్పటికే సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అయిన దగ్గర్నుంచీ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ లో ఉన్నారు. మరికొందరు అభిమానులైతే.. సుకుమార్ తో సినిమా పోయినా ఫర్వాలేదు కానీ.. ముందు ఈ సినిమాను త్వరగా విడుదల చేయమనీ అంటున్నారు. ఏదేమైనా మహర్షి కొత్త విడుదల డేట్ మే 9. మరి ఈ డేట్ మీదైనా నిలబడతారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here