రాజమౌళి పట్టించుకోలేదనే రజినీతో ఓకే అందా..?

0
2514

రాజమౌళితో పనిచేయాలని ప్రతి హీరోయిన్ అండ్ హీరోస్ మామూలుగానే కలలు కనేవారు. ఇక ఇప్పుడు బాహుబలితో ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారిన తర్వాత రాజమౌళితో సినిమా అంటే అదో అదృష్టంగా ఫీలయ్యేవాళ్లు చాలామందే ఉన్నారు. మొన్నటి వరకూ రాజమౌళితో సినిమా చేస్తే టాప్ లీగ్ లోకి వెళతారనుకున్నారు. కానీ ఇప్పుడు టాప్ లీగ్ లో ఉంటేనే రాజమౌళితో సినిమా చేస్తారు అనేలా మారింది సిట్యుయేషన్. ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’(వర్కింగ్ టైటిల్) అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీలో హీరోయిన్ విషయమే ఇప్పటి వరకూ తేలలేదు. అయితే మొన్నటి వరకూ చాలా పేర్లు వినిపించాయి. అలా వినిపించిన పేర్లలో కీర్తి సురేష్ పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు కీర్తికి ఆ కల ఫలించేలా కనిపించడం లేదు.

నిజానికి ఆర్ఆర్ఆర్ లో కీర్తి సురేష్ ను తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ ఆ భావన రాజమౌళిలో ఉందో లేదో తెలియదు కానీ కీర్తి కూడా ఈ ఆఫర్ కోసం వెయిట్ చేసింది. బట్ ఇన్ని రోజులు అవుతున్నా కీర్తికి జక్కన్న క్యాంప్ నుంచి చిన్న హింట్ కూడా రాలేదట. దీంతో ఇక చేసేదేం లేక తమిళంలో రజినీకాంత్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ లో కూడా కీర్తి లేదు అనుకున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నదైన కీర్తితో రొమాన్స్ కు సూపర్ స్టార్ నో చెప్పడమే అందుకు కారణం. అయితే దర్శకుడు మురుగదాస్ రజినీని ఒప్పించాడు. దీంతో కీర్తి సురేష్ ఇక రాజమౌళి సినిమాపై ఆశలు వదులుకున్నట్టే అంటున్నారు. అయితే ఇక్కడ తనకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. రాజమౌళి సినిమాలో ఆఫర్ పోయినా.. రజినీకాంత్ సినిమాలో అంటే చిన్న మేటర్ కాదు. సూపర్ స్టార్ కూ వాల్డ్ వైడ్ గా ఫేమ్ ఉంది కదా. దీంతో ఆ ఫేమ్ ఎంతో కొంత కీర్తికీ అంటుకుంటుంది.. అదీ సినిమా సూపర్ హిట్ అయితేనేలెండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here