ట్రైలర్ తోనే ఏడిపించారు కద సామీ..

0
243
ట్రైలర్ లో సినిమా కంటెంట్ ను ఎలివేట్ చేస్తారు. లేదంటే హీరోయిజం చూపిస్తారు. అవీ కాదంటే తమ సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసేలా హింట్ ఇస్తారు. బట్ ఓ ట్రైలర్ లో రొమాన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్, కంటెంట్, కమర్షియల్ స్టాండర్డ్స్.. అన్నిటికీ మించి చిన్న ట్రైలర్ లోనే అంతులేని భావోద్వేగాలు పండించడం సాధ్యమా.. అంటే సాధ్యమే అని ప్రూవ్ చేస్తోంది నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీ ట్రైలర్…
ఓ ట్రైలర్ చూస్తే సినిమా ఏంటో తెలుసుకోవచ్చు. అదే ట్రైలర్ సినిమా రేంజ్ ను కూడా చెప్పేస్తుంది. అది కమర్షియల్ గా అయినా.. కంటెంట్ పరంగా అయినా. లేటెస్ట్ గా నాని జెర్సీ మూవీ ట్రైలర్ లో వీటికి మించి ఇంకేదో కనిపిస్తోంది. అవే భావోద్వేగాలు. అసలు ట్రైలర్ లోనే ఇన్ని ఎమోషన్స్ ను చూపించడం ఈ మధ్య కాలంలే ఇదే అనుకోవచ్చు. టీనేజ్ లో క్రికెట్ ను ప్రేమించి.. ప్రేమకోసం దాన్ని వదులుకుని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడటం.. అప్పటి వరకూ ప్రేమించిన భార్య ఉద్యోగం లేని భర్తను అవమానించడం.. తన కొడుకు బర్త్ డే కూడా చేయలేక అప్పులు చేసే భర్త.. అన్నిటికీ మించి డబ్బుల కోసం భార్య పర్సులో దొంగతనం చేసే భర్త.. ఇవన్నీ ఉన్నాయీ ట్రైలర్ లో.. బట్ ఒక్కో సీన్ ఒక్కో ఎపిక్ లా ఉండబోతోంది అనేదానికి ఈ ట్రైలర్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది.

మళ్లీరావా సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు పండించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. మొదట్నుంచీ ఈ సినిమాపై చాలామంది పాజిటివ్ గానే స్పందించారు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కథపై గౌరవమూ పెరుగుతుందని చెప్పొచ్చు. నిజంగా నాని నేచురల్ స్టార్ గా ఎదిగింది ఇలా కథకు నిజాయితీగా సరెండర్ కావడం వల్లనే. ఇప్పుడు తనకో రేంజ్ వచ్చింది.అ యినా ఇలాంటి కథకు ఇలాంటి పాత్రకు ఓకే చెప్పాడంటే తెలుస్తుంది.. ఆ కథలో ఎంత దమ్ముందో.. మొత్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోన్న జెర్సీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఈ ట్రైలర్ ఆల్మోస్ట్ స్టాంప్ వేసిందనే చెప్పాలి.