రక్తపు మడుగులో హన్సిక రచ్చ

0
246
హన్సిక.. కన్నేళ్ల క్రితం దేశముదురుతో సౌత్ ఇండియన్ సినిమాకు పరిచయం అయింది. ఒక్క యాక్టింగ్ స్కిల్ తప్ప అన్నీ పుష్కలంగా ఉండే ఈ యాపిల్ బ్యూటీని మనోళ్లెందుకో పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లింది. అనూహ్యంగా అక్కడ టాప్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ అందరు టాప్ స్టార్స్ తోనూ రొమాన్స్ చేసింది. మధ్యలో తెలుగులోనూ అడపాదడపా మెరిసినా ఓ భారీ హిట్ అంటూ ఏమీ లేకుండా పోయాయి. దీంతో ఇక కోలీవుడ్ లోనే పాగా వేసింది. అయితే ప్రస్తుతం అమ్మడు చాలా పాతబడిపోయింది. అందుకే స్టార్ హీరోలెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో రూట్ మార్చి నయనతార గేర్ వేసింది. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అంది. అనుకున్నదే తడవుగా ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ‘మహా’ అంటూ హిందూ, ముస్లీంల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని స్టిల్స్ వదిలింది కదా.. అది అలాంటి సినిమానే అన్నమాట. అన్నట్టు ఈ సినిమా అమ్మడికి కెరీర్ లో 50వ సినిమా. అంటే తను ఏ రేంజ్ లో సినిమాలు చేసిందో ఊహించుకోవచ్చు..
పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా వస్తోన్న ‘మహా’ కోసం మనవాళ్లెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం చాలా అటెన్షన్ తెచ్చుకున్నట్టే. మధ్యలో పోస్టర్స్ తో వచ్చిన కాంట్రవర్శీస్ కూడా అదనంగానే కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో స్టిల్ విడుదల చేసింది. ఇదుగో.. ఇలా బ్లడ్ బాత్ టబ్(రక్తపు స్నాన తొట్టి) లో తుపాకీతో కనిపిస్తోంది.  కాస్త హాట్ గా ఉన్నా ఆ రక్తపు మడుగు చూస్తే వేరే ఆలోచనకే తావు లేకుండా చేసిందన్నమాట.  ఏదేమైనా హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గిన తర్వాత చాలామంది ఇలాంటి వేషాలే వేస్తుంటారు. కానీ అలా వేసిన వాళ్లంతా నయనతారలా హిట్ కావొద్దూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here