‘Guna 369’ Movie Review

0
805

ఆరెక్స్ 100 సినిమా తో సక్సెస్ అందుకున్న కార్తికేయ తర్వాత వచ్చిన హిప్పీ తో మాత్రం ఆ జోరు ని కొనసాగించలేకపోయాడు. తనకి కలిసొచ్చిన మాస్ ఫార్ములా నే నమ్ముకుని మల్లి ‘గుణ369’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి కార్తికేయకి ఈసారైనా తాను అనుకున్న విజయం వరించిందా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం

గుణ (కార్తికేయ) ఎలాగైనా బిటెక్ పాసై, తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. అదే కాలనీ కి కొత్తగా వచ్చిన గీత (అనఘా) అనే అమ్మాయి తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. గుణ మంచితనం తెలుసుకుని గీత కూడా గుణ ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో గుణ ఇబ్బందుల్లో పడతాడు. గుద్దలగుంట రాధ (ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో జైలుకి వెళతాడు. దీనితో అప్పటివరకు సాఫీగా సాగుతున్న గుణ లైఫ్ ఒక్కసారిగా చిన్నాభిన్నమవుతుంది. గుణ కుటుంబం ప్రమాదం లో పాడుతుంది. ఈ సమస్యలని గుణ ఎలా అధిగమించాడు ? అసలు రాదని హత్య చేసిందెవరు? గుణ గీత లు చివరికి ఒక్కటయ్యారా లేదా అన్నదే మిగతా కథ.
కార్తీకేయ మరోసారి యాంగ్రీ హీరో గా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా లవర్‌ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్‌ హాఫ్‌లో మాస్‌ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు వేరియేషన్స్‌ చాలా బాగా చూపించాడు.

యదార్ధ సన్నివేశాల ఆధారంగా కథని సిద్ధం చేసుకున్న డైరెక్టర్ ఆ కథ ని మాస్ కమర్షియల్ స్టైల్ లో చెప్పే ప్రయత్నం లో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బోయపాటి దగ్గర పని చేసిన అనుభవం కూడా బాగానే పనికొచ్చింది. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినప్పటికీ, సెకండ్ హాఫ్ ని మంచి ఎమోషన్ తో, సెంటిమెంట్ తో నడిపించాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్‌ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

స్టోరీ
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్

పంచ్ లైన్ : గుణ మాస్ కి నచ్చేస్తాడు
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here