వ‌రుస సినిమాల‌తో వ‌స్తున్న గోపీచంద్…!

0
2861
‘పంతం’ సినిమాతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది కావొస్తున్నా, ఇంతవరకూ మరో సినిమా రాలేదు. వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ గోపీచంద్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఒక సినిమా చేస్తోన్న ఆయన, సంపత్ నందితో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అంతేకాదు తాజాగా ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌టా. బిను సుబ్రహ్మణ్యం వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో గోపీచంద్ ఓకే చెప్పడం జరిగిందని అంటున్నారు చిత్ర ప‌రిశ్ర‌మ‌. గతంలో గోపీచంద్ తో ‘సాహసం’ సినిమా చేసిన భోగవల్లి ప్రసాద్ .. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు ఓకే చెప్పిన గోపీచంద్ ఈ సినిమాను జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట‌. వ‌రుస పరాజయాలతో ఉన్న గోపిచంద్ కు మ‌రి మూడు సినిమాల్లో ఎన్ని హిట్లు వ‌స్తాయో చూడాలి మ‌రి…