బాలీవుడ్ కోసం చిక్కిపోతున్న మహానటి

0
294
సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు ఒక విషయంలో మాత్రం తేడా ఉంటుంది. మన సినిమాలలో కొంచెం బొద్దుగా ఉన్నా.. అది కూడా ముద్దని సర్డుకుంటాం. కానీ బాలీవుడ్లో అలా కాదు. యాక్టింగ్ వచ్చినా రాకపోయినా కొంపలేం మునగవు.. జీరో సైజ్ మాత్రం బేసిక్ రిక్వైర్ మెంట్. ఇప్పుడు స్టార్ కిడ్స్ లో సగం మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వక ముందు కొబ్బరిబొండాల్లా నిండుగా ఉండేవారు. సోనాక్షి సిన్హా.. సోనమ్ కపూర్.. సారా అలీ ఖాన్ ల పాత ఫోటోలు చూసిన వారికి ఎవరైకైనా ఈ విషయం తెలిసినే ఉంటుంది కానీ వారందరూ సినిమా ఎంట్రీ కోసం స్లిమ్ముగా మారిపోయారు. స్టార్ కిడ్స్ కే తప్పనిది మన మహానటి కీర్తి సురేష్ కు ఎలా తప్పుతుంది?
కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరో. ఈ సినిమాకోసం మరింత అందంగా ఫిట్ గా కనిపించేందుకు ఇప్పటికే రెగ్యులర్ గా జిమ్ముకు వెళ్ళడం..కసరత్తులు చేయడం మొదలుపెట్టిందట. దీంతో ఇప్పటికే కీర్తిలో కొంత మార్పు కనిపిస్తోంది. కీర్తి లాస్ట్ సినిమా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’. ఆ సినిమాలో కాస్త బొద్దుగానే కనిపించిన కీర్తి ఇప్పుడు కాస్త స్లిమ్ అవతారంలో ఉంది. త్వరలో ఇంకా స్లిమ్ గా మారుతుందని టాక్ ఉంది.

ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. ‘బధాయి హో’ ఫేం అమిత్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో కీర్తి డబల్ రోల్ లో నటిస్తోందట.