Game Over Movie Review

0
759
ఈ మ‌ధ్య కాస్త హ‌ర్ర‌ర్ చిత్రాల ట్రెండ్ త‌గ్గిన నేప‌థ్యంలో తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గేమ్ ఓవ‌ర్’ మీద అప్ప‌టివ‌ర‌కు ఇంట్రెస్ట్ లేక‌పోయినా ట్రైల‌ర్ వ‌చ్చాక ఆ జాన‌ర్ ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపింది. దానికితోడు ఆమ‌ధ్య ఆనందో బ్ర‌హ్మ తో మెప్పించిన తాప్సీ ఇందులో కూడా ఏదో డిఫ‌రెంట్ గా ట్రై చేసింద‌న్న ఇంప్రెష‌న్ క‌ల‌గ‌డంతో చెప్పుకోద‌గ్గ పాజిటివ్ వైబ్రేష‌న్స్ తోనే థియేట‌ర్ల‌లోకి అడుగుపెట్టింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను గేమ్ ఓవ‌ర్ అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.
అమృత‌(సంచ‌న న‌ట‌రాజన్) అమ్మాయి ని కిరాత‌కంగా చంపే సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. అమృత‌ను తాళ్ల‌తో క‌ట్టేసిన త‌న ముఖానికి ప్లాస్టిక్ క‌వ‌ర్ తొడిగి ఊపిరాడ‌కుండా చేసిన హంత‌కుడు త‌రువాత ఆమె బాడీని న‌రికి తగుల‌బెడతాడు. వీడియో గేమ్ డిజైన‌ర్ అయిన స్వ‌ప్న (తాప్సీ ప‌న్ను) గ‌తంలో త‌నుకు ఎదురైన చేదు అనుభ‌వాల కార‌ణంగా మాన‌సికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ స‌మ‌స్య కార‌ణంగా ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేసే గాయ‌ప‌డుతుంది. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ప‌రిణామాలు స్వ‌ప్న జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పాయి. స్వ‌ప్న జీవితంతో అమృత‌కి సంబంధ‌మేంటన్న‌ది మిగ‌తా క‌థ‌.
సౌత్ లో త‌నకు మంచి బ్రేక్ రావ‌డానికి తాప్సీ ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీదే దృష్టి పెట్టిన తాప్సీ ఈ సినిమాలో స్వ‌ప్న పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసింది. యాక్ష‌న్, లుక్స్, ఎమోష‌న్స్ ప‌రంగా ప్ర‌తీ విష‌యంలోనూ ప‌ర్ఫెక్ష‌న్ చూపించిన తాప్సీ సినిమా మొత్తాన్ని త‌న భుజాల మీదే న‌డిపించింది. మ‌రో కీల‌క పాత్ర క‌ల‌మ్మ పాత్ర‌కు వినోదిని వైద్య‌నాథ‌న్ పర్ఫెక్ట్ గా  సెట్ అవ‌డంతో పాటూ చాలా స‌హ‌జ న‌ట‌న క‌న‌బ‌రిచింది. ఇత‌ర పాత్ర‌ల్లో అనీష్ కురువిల్లా, సంచ‌న న‌ట‌రాజ‌న్, రమ్య న‌ట‌రాజ‌న్ లు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

సెన్సిబుల్ ఇష్యూస్ ని ట‌చ్ చేస్తూ ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్, ర‌చ‌యిత కావ్య సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ క‌లిగించారు. స్టోరీలో ఉన్న‌ది చాలా పాయింట్ కావ‌డంతో ఫ‌స్టాఫ్ అంతా క‌థేమీ లేన‌ట్ల‌నిపిస్తుంది. కానీ అశ్విన్, కావ్య‌లు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాను ప్రాణం పోసింది. అస‌లు సినిమా చూస్తున్నంత సేపు అంతా క‌ల‌లోనే న‌డుస్తుందా లేదా నిజ‌మా అన్న క‌న్‌ఫ్యూజ‌న్ లో న‌డుస్తుంది. వీటితో పాటు ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ తో పాటు పారానార్మ‌ల్, హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా అంటూ సాంగ్స్, కామెడీని బ‌ల‌వంతంగా ఇరికించ‌కుండా ప‌ర్ఫెక్ట్ థ్రిల్ల‌ర్ గా సినిమాను చాలా బాగా రూపొందించారు. వినోద్ కెమెరా వర్క్ సినిమాకు చాలా ప్ల‌స్. రాన్ ఏతాన్ యోహ‌న్ మ్యూజిక్ ప్ర‌తీ సీన్ ను మ‌రింత్ ఇంట్రెస్టింగ్ మార్చాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
తాప్సీ న‌ట‌న
సినిమాటోగ్ర‌ఫీ
స్క్రీన్ ప్లే

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్
ఫస్టాఫ్

పంచ్‌లైన్ః గేమ్ విన్న‌ర్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here