‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ

0
1056

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. చిత్రం విడుదలకు ముందు సినిమా టైటిల్ ను ‘వాల్మీకి’ నుంచి గద్దలకొండ గణేష్ గా మారిన ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. మరి గద్దలకొండ గణేష్ వారి అంచనాల్ని నిలబెట్టడం లేదా అన్నది సమీక్షలో చూద్దాం..

అభి (అథర్వ) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథ కావాలని నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్ అయిన గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి తన కథే రాయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అభి ఎదుర్కొన్న సవాళ్లేంటి? తను అనుకున్నట్లు కథ రాయగలిగాడా? గద్దలకొండ గణేష్ అలియాస్ గని అసలు ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు? అన్నదే కథ.

అసలు వరుణ్ తేజ్ ఇలాంటి క్యారెక్టర్ ఎన్నుకోవడమే సాహసం. ఈ పాత్రకు వరుణ్ తన గెటప్ ను మార్చుకున్న తీరుకే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. చూడగానే ఒక విలన్ ని చూస్తున్నామన్న భావన తీసుకురాగలిగాడు. వరుణ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిట్లో వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అంటే వరుణే. తమిళ నటుడు అధర్వ బాగా చేసాడు. ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో తన పాత్రను కొంచెం తగ్గించేశారు. డబ్బింగ్ అధర్వకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. పూజ హెగ్డే ఉన్నంతలో అలరించింది. మృణాళిని బాగా ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో దుమ్మురేపాడు. సత్య, తనికెళ్ళ భరణి, మిగిలిన వారు తమ తమ పరిధుల్లో బాగా చేసారు.

సినిమా ఎలా ఉన్నా.. హరీష్ శంకర్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కి కొదవుండదు. ఆ విషయంలో ఈ సినిమా కూడా నిరాశపరచదు. సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్పీడ్ గా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ లు సినిమా మీద ఇంకొంచెం ఆసక్తిని కలిగించి.. సెకండ్ హాఫ్ పై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో గద్దలకొండ గణేష్ బాగా డల్ అయిపోయాడు. హరీష్ శంకర్ ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇందులో యాడ్ చేసాడు.ఈ ఎపిసోడ్ ఉండటం వాళ్ళ సినిమా కి ఓరిదేమి లేదు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్లే గద్దలకొండ పాత్ర సోల్ దెబ్బతింది. ఆ పాత్రను హీరోలా చూపించడం వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ పై పడి సెకండాఫ్ మీద దర్శకుడు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బావుండేదనిపిస్తుంది. ఎప్పటిలాగే హరీష్ శంకర్ డైలాగ్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఇప్పటిదాకా తన కెరీర్ లో క్లాస్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ జె మేయర్ మొదటిసారి మాస్ సినిమాకి పనిచేసాడు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా “వాకా వాకా” అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఎడిటింగ్  ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
వరుణ్ తేజ్
సంగీతం

మైనస్ పాయింట్స్:
రన్ టైం
సెకండాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు

పంచ్ లైన్: గద్దలకొండ గణేష్ నచ్చుతాడు
ఫిల్మ్ జల్సా రేటింగ్:3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here