ఫన్ తో సెంచరీ కొట్టిన ‘కోబ్రా’స్

0
1417
నవ్వు నవ్వించు.. ఆరోగ్యంగా ఉంటారు.. అంటారు.. కానీ ఈ మాట సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. నవ్వించు కోట్లు కొల్లగొట్టు.. యస్.. జెన్యూన్ గా నవ్వించగలిగితే.. ప్రేక్షకులు కోట్లు కట్టబెడతారని మరోసారి ప్రూవ్ అయింది. హాస్యం అధికంగా ఉన్నప్పుడు అక్కడ మైనస్ కూడా మాయమవుతాయి.. అనేదానికి ఇప్పుడు ఎఫ్- 2 కలెక్షన్స్ లో లాఫ్ ఎగ్జాంపుల్..? ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ఎంటైర్ ట్రేడ్ కు షాక్ ఇచ్చింది.
సినిమాల విషయంలో అంచనాలు ఎంత తగ్గినా వాటిని అందుకుంటామనే మేకర్స్ కాన్ఫిడెన్స్ కి రిజల్ట్ సాక్ష్యంగా నిలుస్తుంది. ఎఫ్ -2 విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. యస్.. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాపై మొదట్లో కాస్త డౌట్స్ ఉండేవి. పైగా సంక్రాంతి బరిలో కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో ఎఫ్ -2 కు అది ఎఫెక్ట్ అవుతుందనుకున్నారు. కానీ ఫైనల్ గా వీళ్లు పంచిన నవ్వులకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. సినిమా హిట్ అనేశారు. అయితే ఆ హిట్ టాక్ అలాగే ఆగిపోలేదు. అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు వీరి నవ్వులకు అస్సలు పోటీ లేకుండా పోవడంతో బాక్సాఫీస్ పై వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ లు ఫన్ డయాత్రే చేస్తున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ -2 అతనికి వరుసగా నాలుగో సూపర్ హిట్ ను అందించింది. సెకండ్ హాఫ్ కాస్త యావరేజ్ అనే టాక్ వచ్చినా ఆ నవ్వుల ముందు అన్ని మైనస్ లూ తేలిపోయాయి. దీంతో ఈ మూవీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా తిరుగులేని కలెక్షన్స్ కొల్లగొడుతోంది. వెంకీ కామెడీ టైమింగ్ కు ఏ మాత్రం తగ్గకుండా వరుణ్ తేజ్ కూడా తెలంగాణ స్లాంగ్ లో దుమ్మురేపడంతో ఈ కోబ్రాలిద్దరూ కోట్లు కొల్లగొడుతున్నారు.. ఇక తమన్నా, మెహ్రీన్ లు కూడా అటు కామెడీ టైమింగ్ తో పాటు ఇటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకోవడం మరో ప్లస్ పాయింట్ గా మారింది. మొత్తంగా ఈ యేడాది వంద కోట్లు సాధించిన తొలి సినిమాగా ఎఫ్ -2 సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయినా ఓ కామెడీ సినిమా తెలుగులో ఇన్ని కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here