‘ఎఫ్-2’.. ఏదో తేడా కొడుతోంది అల్లుళ్లూ..

0
238
దిల్ రాజుకు ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. 2018లో ఆయన ఏం చేసినా కలిసి రాలేదు. అందుకే ఈ యేడాది ఆరంభం నుంచే గ్రాండ్ గా మొదలుపెట్టాలనుకుంటున్నాడు. ‘ఎఫ్ -2’తో హిట్ కొట్టి అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. కానీ వరస చూస్తుంటే దిల్ రాజు కోరికను ఈ అల్లుళ్లు నెరవేర్చేలా కనిపించడం లేదు అంటోంది ఫిల్మ్ నగర్. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అనిల్ రావిపూడి గత సినిమాల్లో కంటెంట్ కంటే కామెడీనే ఎక్కువగా ఉండటంతో గట్టెక్కాయి. ఈ సారి కూడా దాన్నే నమ్ముకున్నాడు. కానీ ఈ సారి కామెడీ కంటెంటే కాస్త తేడాగా కనిపిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది. కానీ పాటలు పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇదే టైమ్ లో వైజాగ్ లో ఆడియో విడుదల సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. నిజానికి ఆడియో కంటే ముందే ట్రైలర్ విడుదల చేస్తోన్న టైమ్ లో వీళ్లు అసలు ట్రైలర్ ఇవ్వకుండా అక్కడ బోల్డెంత కేమిడీ చేశారు.. కానీ జనాల దృష్టి అంతా హీరోయిన్లెందుకు రాలేదు.. ట్రైలర్ ఎందుకివ్వలేదు అనేదానిపైనే ఉండటం విశేషం.
ఇక ఈ సారి కామెడీ అంతా భార్యలపై పండించాలనేది అనిల్ రావిపూడి ఆలోచన. ఆ విషయం టీజర్ చెప్పింది. రెండు పాటలు కూడా చెప్పాయి. కానీ.. అదంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పటికే జబర్ధస్త్ వంటి కామెడీ షోస్ అన్నీ నడిచేది భార్యలపై వేస్తోన్న సెటైర్స్ పైనే. అటు అన్ని షోషల్ మీడియా ఫార్మాట్స్ లోనూ భార్యభర్తల పై అనేక సెటైర్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి ఈ సారి ఆకట్టుకోవాలంటే అవన్నీ దాటుకుని రావాలి. లేదంటే వానికి కాపీ కొడుతూ విజువలైజ్ చేయాలి. బట్.. ఈ జనరేషన్ లో అంత సేపూ భార్యలపై చేసే కామెడీని భరించేంత సీన్ ఉందని చెప్పలేం. మరోవైపు ఏ మాత్రం తేడా వచ్చినా మహిళా సంఘాలూ కాచుకుని ఉంటాయి. అప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సరిగా లేదని వెంకటేష్ షూటింగ్ టైమ్ లో కూడా కోప్పడ్డాడనే వార్తలూ ఉన్నాయి. మరి వీటిని అనిల్ రావిపూడి ఎలా ఫేస్ చేశాడో కానీ.. ‘ఎఫ్ -2’తో దిల్ రాజు కోరిక నెరవేరడం అంత సులభం అయితే కాదనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here