‘Evaru’ Movie Review

0
842

టాలీవుడ్ లో థ్రిల్లర్ సినిమాలకి కేరాఫ్ గా మారాడు అడివి శేష్. క్షణం, గూఢచారి సినిమా ల తర్వాత ఇప్పుడు ‘ఎవరు’ అంటూ ప్రేక్షల్ని థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇంట్రెస్టింగ్ ప్రోమో లతో ఆకట్టుకున్న ఎవరు ఆడియన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకుందో సమీక్ష లో చూద్దాం

 సమీరా (రెజీనా కసాండ్రా) ఒక పెద్ద పారిశ్రామికవేత్త భార్య. ఆమె తనపై అత్యాచారం చేసిన డీఎస్పీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపి ఆ కేసులో ఇరుక్కుంటుంది. ఆత్మరక్షణ కోసమే అతడిని చంపినట్లు సమీరా చెబుతుంది కానీ దీని వెనుక వేరే మతలబులున్నట్లు అర్థమవుతుంది. ఈ కేసులో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) సాయం తీసుకుంటుందామె. సమీరాకు సాయం చేసే క్రమంలో అతను అసలు నిజం బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ ఆ నిజం ఏంటి.. ఈ కేసుతో విక్రమ్ కు ఉన్న సంబంధమేంటి అన్నదే మిగతా కథ.
 థ్రిల్లర్ సినిమాల్లో నటించడం శేష్ కి కొట్టినపిండి. తనకి అలవాటైన పాత్రల్లో చాలా అలవోకగా నటించాడు. అనవసరమైన బిల్డప్ లు, పంచ్ డైలాగ్ లు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజినా అద్భుతంగా చేసింది. ఈమధ్య నటనకి ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటున్న రెజినా మరోసారి తన నుంచి మంచి నటనని కనబరిచింది. కీలక పాత్రల్లో చేసిన నవీన్ చంద్ర, మురళి శర్మ, నిహాల్ లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
మొదటి సినిమా అయినా ఎవరు తోనే వెంకట్ రామ్ జి తనదైన ముద్ర వేసాడు. ఇన్వెజిబుల్ గెస్ట్ స్టోరీ లో ఆయన చేసిన మార్పులు, తాను రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. కథ వేరే దగ్గరి నుంచి తీసుకున్న దర్సకుడిగా తన ప్రతిభ చ్చుపించాడు. ఎక్కడ ఫ్లాట్ గా లేకుండా మంచి స్క్రీన్ ప్లే తో సినిమాని రసవత్తరంగా సాగించాడు.  వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం.. సినిమా థీమ్ కు తగ్గట్లుగా సాగిపోయింది. క్లోజప్ షాట్లతో కీలక సన్నివేశాల్ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మొనాటనీ రాకుండా చూడటంతో విజువల్స్ కీలక పాత్ర పోషించాయి. థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో తనకు తానే సాటి అని శ్రీచరణ్ పాకాల మరోసారి రుజువు చేశాయి. సినిమా ఆరంభం నుంచి ఒక మూడ్ లో ఉంచడంలో.. సన్నివేశాలతో పాటు ప్రేక్షకుల్ని పరుగులు పెట్టించడంలో  అతడి నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
రీరికార్డింగ్

మైనస్ పాయింట్స్: 
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

పంచ్ లైన్: ఆకట్టుకునే ఎవరు 
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here