Tuesday, October 15, 2019
Home News Entertainment news ఆ దర్శకుడిని ‘డీల్’ చేసిన దిల్ రాజు

ఆ దర్శకుడిని ‘డీల్’ చేసిన దిల్ రాజు

0
2577

టాలెంట్ ను పసిగట్టడం.. వారికి అవకాశం ఇవ్వడం.. తర్వాత వాడుకోవడం అనేది దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతిభను ప్రోత్సహిస్తూనే.. ఆ ప్రతిభకు అతి తక్కువ వేతనం ఇచ్చే నిర్మాతగానూ ఆయనకు పేరుంది. కానీ అసలు అవకాశం రావడమే ఎక్కువ అని ఫీలయ్యే ఇండస్ట్రీ కదా. అందుకే ఈ విషయం ఎవరూ బయటపెట్టరు. ఆ మేటర్ పక్కన బెడితే లేటెస్ట్ గా దిల్ రాజు ‘ఎఫ్ -2’ బిగ్గెస్ హిట్ బ్యాగ్ చేసుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా విజయం దిల్ రాజును అనిల్ పై మనసు పడేలా చేసింది. మనసు పడ్డాక ఊరుకుంటారా.. అందుకే ఓ డీల్ సెట్ చేశాడట.

మెల్లగా మొదలై వరుస విజయాలతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ రేంజ్ కు చేరిన అనిల్ రావిపూడి టాలెంట్ గురించి దిల్ రాజు పసిగట్టడంలో ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఇలా ఒకే సినిమాతో కాకుండా ఏకండా మనోడితో ఓ డీల్ లాంటిది సెట్ చేశాడట దిల్ రాజు. ఆల్రెడీ తన బ్యానర్ లో ఎఫ్ -2 చేశాడు. దీంతో పాటు అనిల్ రావిపూడి వరుసగా చేస్తోన్న రెండు సినిమాలకూ అతనే నిర్మాత కావడం విశేషం. ఇది యాదృఛ్ఛికంగా జరిగింది అని మాత్రం చెప్పలేం.

ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడు కదా. ఈ మూవీకి నిర్మాణ భాగస్వామి దిల్ రాజే. అనిల్ సుంకర మెయిన్ ప్రొడ్యూసర్ అయినా దిల్ రాజు కూడా భాగస్వామిగా చేరాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ మళ్లీ ఎఫ్ -2కు సీక్వెల్ తీస్తాడు. అదీ దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుంది కదా.. అంటే వరుసగా తనతోనే మూడు సినిమాలు చేసేలా డీల్ సెట్ చేసుకున్నాడు దిల్ రాజు. ఒక రకంగా ఈ రెండూహిట్ అయితే అనిల్ రావిపూడి కూడా త్రివిక్రమ్ లా ఒకే నిర్మాతకు కమిట్ అవుతాడేమో. ఏదేమైనా రాజుగారి బ్రెయినే బ్రెయిన్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here