దిల్ రాజు కు మరో దెబ్బ పడినట్టేనా..?

0
2514

ఒకప్పుడు దిల్ రాజు ఓ సినిమా కొంటున్నాడు అంటే ఆ సినిమా మాగ్జిమం గ్యారెంటీ అనుకున్నారు. అందుకే చాలామంది తమ పోస్టర్స్ లో కూడా ‘దిల్ రాజు మెచ్చిన సినిమా’ అని వేసుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ ఆ టచ్ ఎంతో కాలం నిలవలేదు. ఈ మధ్య దిల్ రాజు అంచనాలు అమాంతంగా తప్పుతున్నాయి. మామూలుగా మంచి జడ్జ్ అయిన దిల్ రాజు తన సినిమాలతో పాటు బయటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అయితే ఈ మధ్య చాలాసార్లు అతని డిస్ట్రిబ్యూషన్ గెస్సింగ్ మిస్ అవుతోంది. దీంతో నష్టాలు భారీగా వస్తున్నాయి. పైగా లాస్ట్ ఇయర్ ఇటు నిర్మాతగానూ, అటు డిస్ట్రిబ్యూటర్ గానూ భారీ లాస్ లు చూశాడు. ఈ యేడాది ‘ఎఫ్ -2’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కానీ వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూషన్ లో కొంత పోగొట్టుకున్నాడు. ఇక లేటెస్ట్ గా చాలామంది వారించిన వినకుండా కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాను కొన్నాడు. దాదాపు 7 కోట్లకు కొన్నాడు అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదు.

కళ్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే కాంబినేషన్లో కెవి గుహన్ డైరెక్షన్ లో వచ్చిన ‘118’కు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. చాలామంది పాత సినిమాల్లానే ఉందంటున్నారు. అంతే కాక సినిమాకు ముందు నుంచీ పెద్దగా హైప్ లేదు. దీంతో ఈ మిక్స్ డ్ టాక్ మరింత ప్రాబ్లమ్స్ తెచ్చే అవకాశం ఉంది. మామూలుగా ఎన్టీఆర్ అభిమానులు సపోర్ట్ చేస్తోన్న కళ్యాణ్ రామ్ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం కోటి 40 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇది కూడా గ్రాస్. అంటే ఇది పెద్ద ఇబ్బందే. అయితే సినిమాకు పెద్దగా పోటీ లేదు కాబట్టి పికప్ అవుతుంది అనుకోవడానికి లేదు. హిట్ టాక్ వస్తే తప్ప అది సాధ్యం కాదు. సో.. దిల్ రాజు మరోసారి డిస్ట్రిబ్యూటర్ గా దెబ్బతిన్నట్టే అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here