వినయ విధేయుడుకి సెన్సార్ భయం పట్టుకుందా..?

0
323
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ నెల 7న సెన్సార్ ముందుకు వెళ్లబోతోంది. అయితే సెన్సార్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ వచ్చినా ఓకే కానీ.. బోయపాటి చాలా ఇష్టంగా తెరకెక్కించిన కొన్ని సీన్స్ సెన్సార్ లో పోతాయనే భయం పట్టుకుందట  టీమ్ కు. ఎందుకంటే ఆ సీన్స్ లో వెండితెరపై రక్తం ఏరులై పారుతుందని సమాచారం. మరి ఎంత మాస్ సినిమా అయితే మాత్రం అంత వయొలెన్స్ ను జనం తట్టుకుంటారా అనేది పెద్ద ప్రశ్నే. జనం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా సెన్సార్ కట్టింగ్ తప్పదు అంటున్నారు.
ఇక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వయొలెన్స్ హెవీ గా ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. అలాగే బోయపాటి రాసిన కొన్ని డైలాగ్స్ కూడా కట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. వీటిలో ముఖ్యంగా రేస్(జాతి)కు సంబంధించిన మాటలు కూడా ఉన్నాయట. దాదాపు అవే సెన్సార్ లో కట్ కావొచ్చు అంటున్నారు. ఈ విషయంలో ఒక వేళ సెన్సాన్ ఆ సీన్స్ లేదా మాటలు తొలగించమంటే ఆల్టర్నేషన్ గా ఏం చేయాలో కూడా సిద్ధంగానే ఉన్నాడట బోయపాటి. కానీ వయొలెన్స్ లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదంటున్నట్టు టాక్. మొత్తంగా ఈ నెల 7న సెన్సార్ పూర్తి చేసుకుని వినయ విధేయుడు సంక్రాంతి బరిలో దిగుతున్నాడు.. మరి హ్యాట్రిక్ పై కన్నేసిన రామ్ చరణ్ కు ఈ సినిమా ఆ స్థాయి విజయం ఇస్తుందా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here