Friday, September 20, 2019

సందీప్ కిషన్ మరోటి పట్టాడండోయ్

సందీప్ కిషన్.. ఇన్నేళ్ల కెరీర్ లో ఒకే ఒక్క జెన్యూన్ హిట్ ఉన్న హీరో. అయినా సరే ఆఫర్స్ తగ్గడం లేదు అతనికి. మధ్యలో కొంత బ్రేక్ పడినా మళ్లీ వరుసగా బిజీ...

బోయపాటి పేరు వింటే ఉలిక్కిపడుతోన్న టాలీవుడ్

బోయపాటి శ్రీను.. దర్శకుడుగా అతనిది ప్రత్యేకమైన ముద్ర. ఎమోషనల్ స్టోరీస్ కు యాక్షన్ కోట్ తో ఎంటర్టైన్ చేయడం అతని స్టైల్. కానీ చాలా వరకూ అతను యాక్షన్ కే పెద్ద టేబుల్...

విజయ్ దేవరకొండ పాత్రలో తమిళ్ స్టార్

విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్.. షార్ట్ టైమ్ లో లార్జ్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లోనూ ఓ రేంజ్ క్రేజ్ ఉంది. అక్కడ ఒక్క సినిమా కూడా...

రజినీకాంత్ కు షాక్ ఇచ్చిన అజిత్

ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ వార్ లో ఉంటే బాటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సంక్రాంతికి కోలీవుడ్లో ఇలాగే ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ బరిలో...

ఎడ్యుకేష‌న్ వ్య‌వ‌స్థ లోని లోపాల‌తో అక్ష‌ర

నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్నఅక్ష‌ర మూవీ మోష‌న్ పోస్ట‌ర్ భోగిసంద‌ర్బంగా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.ప్ర‌స్తుతం స‌మాజంలో విద్య‌కు మించిన వ్యాపారం లేద‌నే మాట ఎక్కువుగా విన‌ప‌డుతుంది. కానీ స‌మాజాన్ని మార్చే ఆయుధం విద్యే...

కామెడీ సరే.. కథలేవీ అనిల్

కామెడీతో హిట్లు కొట్టడం ఓ పద్దతి. కానీ కేవలం కామెడీనే నమ్ముకుని కథలను లైట్ తీసుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని నమ్ముతున్న దర్శకుడుగా అతన్ని చెప్పొచ్చు....

వినయ విధేయ రామ కు ట్రెయిన్ ఎఫెక్ట్

వినయ విధేయ రామ.. రామ్ చరణ్ చాలా అంచనాలు పెట్టుకున్న సినిమా. బోయపాటి శ్రీను తో చేస్తే కిక్ వచ్చిందని చెప్పుకున్న సినిమా. కానీ ఆ కిక్ ఆడియన్స్ కు ఎక్కలేదు సరికదా...

సంక్రాంతి విజేత వెంకీయేనా..?

ఈ సంక్రాంతి పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనేది నిజం. మొదటగా రిలీజ్ అయిన సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కు మంచి టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గ కలెక్షన్స్ లేవు. ఈ పరిణామం చూసి సినిమా చేసిన...

‘యమ్‌6’ సెన్సార్‌ పూర్తి – ఫిబ్రవరి మొదటి వారం విడుదల

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం 'యమ్‌6'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత...

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌

వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌విప్ర‌కాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, కామెడి, ప్ర‌ధానాంశ‌ముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.  ఈసంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను శ‌నివారం ఫిల్మిఛాంబ‌ర్‌లో హీరో జాన్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో... మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆల్‌డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొద‌టి చిత్రం. బేసిక్‌గా నేను తెలుగువాడిని కాక‌పోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్ర‌వంతి మూవీస్‌కి వ‌ర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. త‌మిళ్‌లో దాదాపుగా 7 చిత్రాల‌కు సంగీతాన్ని అందించాను. ఈ సంవ‌త్స‌రం నాకు గొప్ప‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. తెలుగులో కూడా బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. న‌న్ను మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌నికోరుకుంటూ నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన అంద‌రికీ  కృత‌జ్ఞ‌త‌లు. హీరో జాన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మూడ‌వ చిత్రం. అదే నువ్వు అదేనేను, బంటీ ద బ్యాడ్ బోయ్ త‌ర్వాత నేను న‌టించే మూడ‌వ చిత్ర‌మిది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ర‌విగారికి నా కృత‌జ్ఞ‌త‌లు. తెలుగుఇండ‌స్ర్టీ చాలా పెద్ద‌ది. చాలా బావుంటుంది. ఈ రోజు లెజండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాధ్‌గారిని క‌లిసి మా ఆడియోని రిలీజ్ చేశాము. ఆయ‌న న‌న్ను చూసి ప్ర‌భాస్‌లా ఉన్నావు అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్దడైరెక్ట‌ర్ న‌న్ను పొగ‌డ‌డం అంటే మాములు విష‌యం కాదు, అంద‌రూ న‌న్ను త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. ద‌ర్శ‌కుడు ర‌విప్ర‌కాష్‌ మాట్లాడుతూ... ముందు నా కెరియ‌ర్ మొద‌లైంది కె.విశ్వ‌నాధ్‌గారి ద‌గ్గ‌ర‌. ఆయ‌న ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా చాలా సినిమాల‌కు ప‌ని చేశాను. త‌ర్వాత సింగీతం శ్రీ‌నివాస్ గారు ద‌గ్గ‌ర 14 సినిమాల‌కు ప‌ని చేశాను. నేను చాలా అదృష్ట‌వంతుడిని అలాంటి లెజండ‌రీ డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం నాకు చాలా గ‌ర్వంగా ఉంది. హీరో జాన్ ఆల్రెడీ నా పిల్లల చిత్రం చేశారు. అందుకే ఆయ‌న్నే హీరోగా ఎంచుకున్నా. నేను చేసిన బంటీ ద బ్యాడ్ బాయ్ కిఎన్నో అవార్డులు వ‌చ్చాయి. ఒక రివార్డు వ‌చ్చే సినిమా చెయ్యాల‌ని ఈ సినిమా చేస్తున్నాను. ఇది ఒక థ్రిల‌ర్.చాలా అత్యాధ్బుతంగా ఉంటుంది. చిత్రంలో ఎక్క‌డా ల్యాగ్ ఉండ‌దు. సినిమా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటే చాలు బ‌డ్జెట్ తోప‌నిలేదు. నా హీరోకి నేను ముందుగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. ఇందులో న‌లుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. జ‌య‌వాణి ఒక మాంత్రికురాలిగా ప్ర‌త్యేక పాత్ర‌లో చేశారు. చాలా బాగా చేశారు. టెక్నీషియ‌న్లు అంద‌రూ ఈ చిత్రం కోసంచాలా క‌ష్ట‌ప‌డ్డారు. అందువ‌ల్లే ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. న‌టీన‌టులుః ప్ర‌ముఖ సింగ‌ర్ క‌ల్ప‌న (పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో) అంగ‌నారాయ్ నెగెటివ్ షేడ్ హీరోయిన్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఆర్‌.పి.వినోద్‌, అప్పారావు, హీరో జాన్‌, హీరోయిన్ ప్రియాంక‌, హ‌ర్ష‌ద‌, తేజారెడ్డి, జ‌య‌వాణి, కె.కోటేశ్వ‌ర‌రావు, వంశీ త‌దిత‌రులున‌టించిన ఈ చిత్రానికి సంగీతంఃఆల్‌డ్రిన్‌, డి.ఓ.పి. రామ్‌పినిశెట్టి, పాట‌లుఃవెన్నెల‌కంటి, ఎడిటింగ్ఃఆకుల‌భాస్క‌ర్‌, మాట‌లుఃనాగుల‌కొండ న‌వ‌కాంత్‌, ఫైట్స్ఃకృష్ణంరాజు, డ్యాన్స్ఃసుజ్జి, చార్లీ, నిర్మాత, ద‌ర్శ‌కుడుఃర‌విప్ర‌కాష్‌క్రిష్ణంశెట్టి

Latest article

నాని’స్ ”గ్యాంగ్ లీడర్” రేంజ్ పడిపోయిందిగా..

నాని కథానాయకుడిగా నటించిన నానీ'స్ ''గ్యాంగ్ లీడర్'' చిత్రానికి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. తొలి వీకెండ్ ఫర్వాలేదనిపించే వసూళ్లు అయితే సాధించింది కానీ సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలైంది. నాలుగో రోజుకే...

”గద్దలకొండ గణేష్” గా మారిన వాల్మీకి..

''వాల్మీకి'' టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేయగా...

”ఫీట్ అప్ విత్ ది స్టార్స్” షో ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు – మంచు లక్ష్మి

డిజిటల్  మీడియా రివల్యూషన్  చాలా వినోదాలను అందుబాటులో కి తెస్తుంది.  ఎంటర్ టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదలను పరిచయం చేస్తుంది.  అలాంటి వూట్ అప్  ప్రెజెంట్స్ 'ఫీట్ అప్ విత్ ద...