‘Burra Katha’ Movie Review

0
884

ఆది సాయికుమార్ హీరోగా స‌క్సెస్‌ను సాధించి చాలా రోజులైంది. మంచి ప్ర‌య‌త్నంతో ఆదిసాయికుమార్ ఆక‌ట్టుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలే చేస్తూ వ‌స్తున్నారు. ఆ క్ర‌మంలో ఈ యువ హీరో న‌టించిన చిత్రం ‘బుర్ర‌క‌థ‌’. రెండు మెదళ్లు ఉండే వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కొన్నార‌నే క‌థాంశంతో రూపొందిన బుర్ర‌క‌థ‌తో ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడిగా మారారు. మరి ద‌ర్శ‌కుడిగా ర‌త్న‌బాబు తొలి హిట్ కొట్టాడా? లేదా? అని తెలియాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.

అభిరామ్‌(ఆది సాయికుమార్‌) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో అభిరామ్‌ కాస్త అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్‌ గడిపేస్తూ ఉంటారు. ఏవైనా పెద్ద శబ్దాలను విన్నప్పుడు అభి, రామ్‌గా.. రామ్‌ అభిగా మారిపోతూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెంచుతారు ఈశ్వర్‌ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌). వ్యతిరేక ధృవాలుగా ఉన్న అభి, రామ్‌ ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారో అని ఈశ్వర్‌ ప్రసాద్‌ ఎదురుచూస్తు ఉంటాడు. రెండు మెదళ్లైనా.. వారిద్దరిది ఒకే మనసు అని అభి, రామ్‌ తెలుసుకుంటారని ఆశిస్తూ ఉంటాడు? అయితే అభిరామ్‌ జీవితంలోకి హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), గగన్‌ విహారి(అభిమన్యు సింగ్‌) రాకతో ఎలాంటి చిక్కులు వచ్చాయి? చివరకు అభి, రామ్‌ కలిసిపోయి అభిరామ్‌ అయ్యారా? అభిరామ్‌ తండ్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ కోరిక నెరవేరిందా అన్నదే మిగతా కథ.

అభి, రామ్‌ రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఆది సాయి కుమార్‌ ప్రేక్షకులను మెప్పిస్తాడు. మొదటి చిత్రం నుంచి ఆది తన స్టెప్పులతో, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ఆది డ్యాన్స్‌, యాక్షన్స్‌తో ఆకట్టుకుంటాడు. అభిగా అల్లరిచిల్లరగా తిరిగే పాత్రకు, రామ్‌ లాంటి డీసెంట్‌ క్యారెక్టర్‌కు తన నటనతో వేరియేషన్‌ చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ అలవోకగా నటించేశాడు. హాస్యాన్ని పండించడమే కాదు, ఎమోషన్స్‌ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు. హీరోయిన్‌గా మిస్త్రీ చక్రవర్తి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. లుక్స్‌ పరంగా ఓకే అనిపించింది. మరో హీరోయిన్‌ అయిన నైరాషా కనిపించిన రెండు మూడు సీన్స్‌లో ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో కమెడియన్‌ పృథ్వీ, గాయత్రి గుప్తా, జబర్ధస్త్‌ మహేష్‌, విలన్‌ పాత్రలో అభిమన్యు సింగ్‌ తమపరిధి మేరకు నటించారు.

రచయితలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కించడం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో కొందరు సక్సెస్‌ అవ్వగా మరికొందరు వెనకబడ్డారు. అయితే డైలాగ్‌ రైటర్‌గా మంచి పేరున్న డైమండ్‌ రత్నబాబు.. ఈ చిత్రంలో కూడా మంచి పంచ్‌ డైలాగ్‌లను రాశాడు కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ గా మ‌ల‌చ‌డంలో మాత్రం ఫెయిల‌య్యాడు. ప్రతీ సన్నివేశం అతికించినట్లు అనిపించడంతో.. చూసే ప్రేక్షకుడికి ఫ్లో మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. రత్నబాబు రచయితగా సక్సెస్‌ అయినా.. దర్శకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు. ఈ చిత్రాన్ని కమర్షియల్‌ హంగులతో, కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలచడంతో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. కథలో ఏం జరగబోతోంది అన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. కెమెరామెన్‌ ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. సంగీత దర్శకుడిగా సాయి కార్తీక్‌ ఓకే అనిపించాడు. నేపథ్య సంగీతం కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోదు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
కామెడీ

మైన‌స్ పాయింట్స్ః
స్క్రీన్ ప్లే
కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

పంచ్‌లైన్ః బుర్ర లేని క‌థ‌
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here