‘బందోబస్త్’ మూవీ రివ్యూ..

0
1087

గత కొంతకాలంగా సూర్య సినిమాలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. దాంతో తమిళనాట మాత్రమే కాదు ఇక్కడ కూడా సూర్య మార్కెట్ బాగా దెబ్బతింది. అందుకే ఈసారి ఎలాగయినా హిట్ అందుకోవాలి అని టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ ఆనంద్‌తో జతకట్టి ‘బందోబస్త్’ అనే సినిమా చేసాడు. సూర్యతో పాటు మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌ల్ కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని బందోబస్త్ అందుకుందా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

ఇండియా ప్రైమ్ మినిస్టర్ చంద్రకాంత్ వర్మ( మోహన్ లాల్) ఇంగ్లాండ్ పర్యటనకు వెళతాడు. అక్కడ ఆయన మీద జరిగిన అటాక్ నుండి రక్షించిన మిలిటరీ ఆఫీసర్ రవి  (సూర్య) ట్రాక్ రికార్డ్ నచ్చి అతన్ని తన సెక్యూరిటీ వింగ్ ఎస్పీజీకి హెడ్‌గా నియమించుకుంటాడు. అయితే ఆ తరువాత ఎవరో రవికి ఓపెన్‌గా ఛాలెంజ్ విసిరి, చెప్పినట్టుగానే ప్రైమ్ మినిస్టర్‌ని చంపేస్తారు. దాంతో దాన్ని కారణంగా చూపి రవిని ఎస్పీజీ నుండి సస్పెండ్ చేస్తారు. ఇంతకీ ప్రైమ్ మినిస్టర్‌ని చంపింది ఎవరు?, వాళ్ళని రవి ఎలా కనిపెట్టాడు?, ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే మిగతా కథ.

సూర్య ఎన్‌.ఎస్‌.జి క‌మాండో ర‌వి పాత్ర‌లో ఒదిగిపోయాడు. లుక్, ఫిజిక్ త‌దిత‌ర విష‌యాల‌పై ఆయ‌న తీసుకున్నస్పెష‌ల్ కేర్ తెర‌పై క‌ప‌డుతుంది. మోహ‌న్‌లాల్ ప్ర‌ధాని పాత్ర‌లో చ‌క్క‌గా స‌రిపోయారు. ప్రధాని పాత్ర‌లో హుందాగా క‌నిపించారు. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం ఆయ‌న‌కు పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాదు. ఇక ఆర్య రోల్ సెకండాఫ్‌లో ప్ర‌ధానంగా సాగుతుంది. అస‌లు ఆర్య ఎక్కడ మెయిన్ విల‌నో అనే సందేహం ప్రేక్ష‌కుడికి రాక మాన‌దు. స‌యేషా సైగ‌ల్ పాత్ర చాలా ప‌రిమితంగా ఉంది. పాట‌లు, రెండు, మూడు ల‌వ్ సీన్స్‌కే ప‌రిమిత‌మైంది. స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ, ఇత‌ర పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌లకు న్యాయం చేశారు.

దర్శ‌కుడు కె.వి.ఆనంద్ ఇది వ‌ర‌కు సూర్య‌తో తెర‌కెక్కించిన డిఫ‌రెంట్ ఫార్మేట్ థ్రిల్ల‌ర్ జోన‌ర్స్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. సెకండాఫ్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ అన్నీ తేలిపోయాయి. గ్రిప్పింగ్‌ సీన్స్ కానీ, ఎంగేజింగ్ సీన్స్ కానీ లేవు. ల‌వ్ ట్రాక్ బోరింగ్‌గా ఉంది. ఎం.ఎస్‌.ప్ర‌భు కెమెరా ప‌నితనం బాగానే ఉంది.పాటలు తో సినిమా మీద ఉన్న ఆసక్తి మొత్తం పోతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త బావుండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
ఇంట్రడక్షన్ సీన్స్
నటీనటుల నటన

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్: ‘బందోబస్త్’ ఏమీ లేదు
ఫిల్మ్ జల్సా రేటింగ్: 2.5/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here