Bala Krishna Makeover for his Next Movie

0
281

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఆరు నెలలకు పైగా రెస్ట్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు తన 105 సినిమాకు రంగంలోకి దిగేశాడు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి కానీ ఇంకో రెండు నెలలు ఆగితే కానీ క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా తాలూకు డిఫరెంట్ లుక్ లో బాలయ్య పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఫ్రెంచ్ కట్ తరహాలో గెడ్డం రెండు వైపులా షేవ్ చేసి చుబుకం కింద చక్కగా ట్రిమ్ చేసిన స్టైల్ తో బాలయ్య ఇంకాస్త యంగ్ లుక్ లోకి మారిపోయాడు. ఇప్పటికే ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్న బాలయ్య ఫ్యాన్స్ మరో మంచి ఎంటర్ టైనర్ తమ హీరో నుంచి వస్తోందని సంబరపడుతున్నారు. జైసింహతో తనకో డీసెంట్ కమర్షియల్ హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో మరోసారి ఆయనకే ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ – వేదిక హీరొయిన్లుగా నటిస్తుండగా జగపతిబాబు మెయిన్ విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ఇప్పుడీ గెటప్ తో చాలా కీలకమైన సన్నివేశాలు ఉంటాయట. ఫస్ట్ హాఫ్ లో ఈ లుక్ లో కనిపించి సెకండ్ హాఫ్ లో ఎవరూ ఊహించని గెటప్ తో మంచి మాస్ మసాలా ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. శాతకర్ణి-జైసింహ ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here