రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న ‘అక్షర’

0
1282

నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న “అక్షర” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. ‘‘ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన కథ ఇది. నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండానే అద్భుతమైన మెసేజ్ తో వస్తోన్న అక్షర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇక సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాం. ఇక సినిమాను అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.

దర్శకుడు బి. చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘అవుట్ పుట్ పై మాకు పూర్తి సంతృప్తిగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం  ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. మొత్తంగా అక్టోబర్ ద్వితీయార్థంలో వస్తోన్న మా అక్షర మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికి
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన, దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

Akshara to release in the second half of October

Actress Nanditha Shweta-starrer Akshara has been wrapped up and is all set for release. The teaser and trailer released in the past have already been received well leaving an unprecedented buzz for the film which the makers are working on releasing soon.

Speaking about the same, producers Suresh Varma Alluri and Ahiteja Bellamkonda said, “Akshara is a film that pinpoints flaws in the education system along with providing a solution to it. Nanditha Shweta’s character is going to be one that everyone will connect to! We combined the message with an entertaining film to give the audience the best of both worlds. The film is presently in post-production and we are excited to bring it to the audiences in the second half of October. After the positive response to the teaser and trailer, we feel the film will also be received with the same enthusiasm by the audiences.”

Director B. Chinni Krishna said, “We are quite satisfied with the output and can’t wait to show it to the audiences. Stories like Akshara aren’t told often and I am so glad I got to associate with this film!”

While Nanditha Shweta plays the title role, the film also has Madhunandan, Satya, Shakalaka Shankar, and Sritej amongst others in the cast.

Crew
Cameraman: Nagesh Banell
Music: Suresh Bobbili
Editor: G. Satya
Art Director: Suresh Babu Timmiri
Costume Designer: Gauri Naidu
Line Producer: Gangadhar, Raju Oleti
PRO : GSK Media
Co – Producers : K.Srinivas Reddy,Sumanth
Banner: Cinemaa Hall entertainments
Producers : Suresh Varma alluri,Ahiteja Bellamkonda
Writer and Director : B.Chinni Krishna.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here