హిట్టు కోసం అక్కినేని వారి తిప్పలు..

0
1324

టాలీవుడ్లో చెరగని ముద్రవేసిన అక్కినేని నాగేశ్వర్ రావు గారి వారసత్వం నాగార్జున చక్కగా అందిపుచ్చుకున్నాడు కానీ మిగిలిన హీరోలు మాత్రం తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పరచుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అదే ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ లో సైలెన్స్ కి కారణం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దశాబ్దాల క్రితం రామ్ గోపాల్ వర్మ ప్రేమకథతో పరిచయమైన సుమంత్ కొన్నాళ్ళు బాగానే కెరీర్ ని రన్ చేసాడు కాని ఆ తర్వాత వరస ఫెయిల్యూర్స్ తో కొంత గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళిరావా లాంటి డీసెంట్ తో హిట్ కం బ్యాక్ ఇచ్చినా సుబ్రమణ్యపురం – ఇదం జగత్ సినిమాలు సీన్ ని మళ్ళీ మొదటికే తెచ్చాయి. మరోవైపు సుశాంత్ చిలసౌతో మొదటి బోణీ కొట్టాడు కాని నిర్మాతలకే ఇంకా కాన్ఫిడెన్స్ రాక కథలు చెప్పడం లేదని అదొక గాసిప్.

ప్రస్తుతానికి చైతు ఒక్కడే కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాడు. మజిలితో కోలుకున్నాడు. అఖిల్ ఎంట్రీ జరిగి నాలుగేళ్ళు అవుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సుప్రియ గూడచారితో కం బ్యాక్ చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక అఖిల్ సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు లాంచ్, రీ లాంచ్, రీ రీ లాంచ్ లు జరిగిన తన ఖాతాలో హిట్ మాత్రం వేసుకోలేకపోయాడు. స్వయానా నాగార్జున ట్రాక్ రికార్డే తేడా కొడుతోంది. మన్మధుడు 2 డిజాస్టర్ సంగతి పక్కనపెడితే కంటెంట్ గురించి చాలా విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఊపిరి తర్వాత నాగ్ గర్వంగా చెప్పుకునే హిట్ ఒక్కటీ లేదు. ఇలా ఫ్యామిలీ మొత్తం ఓ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూడాల్సి రావడం నిజంగా అభిమానులను కలవరపరిచేదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here