Adi Oka Idhi le Trailer launched by Dil Raju

0
1537
850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు. ఇన్నేళ్ల తన అనుభవంతో మెగాఫోన్ పట్టుకుని తొలిసారిగా ఓ
క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా ఇది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారి చేతుల
మీదుగా విడుదల చేశారు.
 ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘850సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన స్వర్ణ మాస్టర్ డైరెక్ట్ చేసిన అది ఒక ఇదిలే ట్రైలర్ నా
చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ బావుంది. ట్రైలర్ చూస్తే ఓ క్యూట్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది.ఓ ఫ్లాట్ లో ఉండే యువత మధ్య జరిగే ప్రేమకథగా నాకు
అర్థమైంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్’’ అన్నారు..
హీరో సవ్యసాచి మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా జర్నీ అంతా నా లైఫ్ లో ఓ డ్రీమ్ లాగా జరిగింది. అంత పెద్ద టెక్నీషియన్ ఫస్ట్ మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టం. స్టోరీ
సెషన్, వర్క్ షాప్స్ అన్నీ కలిపి నాకో లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ లా ఉంది. ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా మీ అందరికీ ఖచ్చితంగా
నచ్చుతుందీ సినిమా. కొత్తవాళ్లమే అయినా మంచి టీమ్ మీ ముందుకు వస్తోంది. ఇక దిల్ రాజుగారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశాము.. ఆయనకు మా ట్రైలర్ బాగా
నచ్చింది. ఇది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ను ఇచ్చింది.. మీ అందరి ఆశిస్సులు మాకు కావాలి..’’అన్నాడు..
హీరోయిన్ రాధికా ప్రీతి మాట్లాడుతూ .. ‘‘స్వర్ణ మేడమ్ గురించి నాకు అంతకు ముందు పెద్దగా తెలియదు. కానీ నాకు కథ తెలిసి ఆడిషన్ కు వెళ్లాను. మేడమ్ నన్ను సెలెక్ట్
చేశారు. మా అందరికీ ఈ మూవీ మంచి లైఫ్ ఇస్తుంది. మా టీమ్ అందరికీ మీ ఆశిస్సులు కావాలి’’ అని చెప్పింది.
అది ఒక ఇదిలే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన మహీ మాట్లాడుతూ .. ‘‘అది ఒక ఇదిలే దిల్ రాజు గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషాన్నిచ్చింది. ఓ మంచి
ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తున్నాం.. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి..’’ అన్నాడు.
సపోర్టింగ్ ఆర్టిస్ట్ రాహుల్ మాట్లాడుతూ .. ‘‘ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టోరీ ఉంది. మీ అందరికీ నచ్చే అన్ని అంశాలూ ఉన్నాయి. మాకు మీ అందరి సపోర్ట్
కావాలని కోరుకుంటున్నా’’ అన్నాడు.
మరో సపోర్టిగ్ ఆర్టిస్ట్ హారిక మాట్లాడుతూ ‘‘ఈ తరహా కథలు యూత్ కు బాగా నచ్చుతాయి. అలాగే ఫ్యామిలీకి నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. మీ అందరికీ ఈ సినిమా
నచ్చుతుందని ఆశిస్తున్నాను’’అని చెప్పింది.
నిర్మాత, దర్శకురాలు స్వర్ణ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ అందరికీ మీ ఆశీర్వాదం కావాలి. సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది. మీ
అందరినీ మళ్లీ థియేటర్స్ లో కలుసుకుంటాను.. థ్యాంక్యూ’’ అని చెప్పారు.
ఎఎస్. ఎస్ డ్రీమ్ కలర్స్ బ్యానర్ పై తనీష్ బాబు సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సవ్యసాచి, రాధికా ప్రీతి జంటగా నటిస్తుండగా.. మహీధర్, శ్యామ్ కుమార్, రాహుల్, తేజో
వికాస్, హారిక, రక్ష, తరుణ్ మాస్టర్, అప్పాజీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మంచి నిర్మాణ విలువలతో వస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : శ్రీధర్ నర్లార్, సంగీతం : మురళిధర్ రాగి, ఎడిటర్ : బసవ పైడిరెడ్డి, పిఆర్.వో : జిఎస్.కే మీడియా, రచన, నిర్మాత,
కొరియోగ్రఫీ, దర్శకత్వం : స్వర్ణ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here