2019 ఫస్ట్ టేబుల్ ప్రాఫిట్ మూవీ ‘జెర్సీ’

0
3093
నేచురల్ స్టార్ మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం టీజర్ లిరికల్ సాంగ్స్ తోనే జెర్సీపై భారీ అంచనాలు పెంచాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇక నాని స్టామినా గురించి కొత్తగా చెప్పేదేం లేదు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా నిర్మాత హ్యాపీగా తడిగుడ్డేసుకుని పడుకోవచ్చు. ప్రస్తుతం కొంత ఫ్లాపుల్లో ఉన్నా.. జెర్సీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నానిని మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది. దీంతో సినిమా ఇప్పటికే టేబిల్ ప్రాఫిట్స్ తెచ్చేసుకుని ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరుస్తోంది.. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ, పిడివి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అయిన బడ్జెట్ 22 కోట్లట. కానీ అందుకు డబుల్ ప్రాఫిట్స్ అన్ని రకాల రైట్స్ రూపంలో తెచ్చేసుకుందీ సినిమా.
మామూలుగానే నానికి ఓవర్శీస్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సారి డబుల్అయింది. ఇంకా ట్రైలర్ కూడా రాని సినిమాకు ఏకంగా నాలుగున్నర కోట్లు రైట్స్ పలికిందంటే నాని స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రలో 12, నైజాం ఏరియాను 8 సీడెడ్ లో నాలుగుకు పైన ఇలా అన్ని ఏరియాలకు మంచి రేట్స్ కే అమ్మేశారట. ఇక కర్ణాటక వంటి ప్రాంతాల్లోనూ మంచి రేటే వచ్చిందంటున్నారు. అటు శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ ఇలా అన్ని ఫార్మాట్స్ కు కలుపుకుని ఇప్పటికే 45కోట్ల వరకూ బిజినెస్ అయినట్టు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా డబుల్ ప్రాఫిట్స్ రిలీజ్ కు ముందే తెచ్చుకున్న సినిమా జెర్సీనే అనుకోవచ్చు.

36యేళ్ల వయసులో కూడా క్రికెటర్ కావాలని కలలు కన్న ఓ యువకుడి కథతో వస్తోన్న సినిమా ఈ జెర్సీ. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమా మళ్లీరావాతోనే ఆకట్టుకున్నాడు. అతని రైటప్ లోని సెన్సిబిల్ ఎబిలిటీస్ ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతాయంటున్నారు. మంచి భావోద్వేగాలున్న సినిమాగా ఇది నానికి కూడా మెమరబుల్ అవుతుంది నమ్ముతున్నారు చాలామంది. కాకపోతే ద్వీతీయ విఘ్నం అనే ప్రమాదాన్ని మాత్రం దాటాలి గౌతమ్.