యాత్ర సినిమా పై స్పందించిన‌ వైఎస్ విజ‌య‌మ్మ‌

0
1896

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాను వైఎస్ సతీమణి విజయమ్మ తిల‌కించారు. ఈ చిత్రాన్ని చూసిన విజ‌య‌మ్మ చిత్ర యూనిట్ అంద‌రిని అభినందించారు. యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్‌ సజీవంగా మనముందు లేకపోయినా… యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు విధానాన్ని చాలా చ‌క్క‌గా చూపించి ద‌ర్శ‌క, నిర్మ‌తాల‌ను అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్‌ కట్టుబడేవారని ఆమె తెలిపారు. వైఎస్ జీవితగాథను ఇంత అథ్భుతంగా చిత్ర‌క‌రించి అంద‌రికి నా కృత‌ఙ్ఞ‌త‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here