Star Producer Fails to Introduced his Son

0
460

ఈ శుక్ర‌వారం సీత‌తో పాటు ఇంకొన్ని తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి కానీ ఆ సినిమాల‌కు స‌రైన ప‌బ్లిసిటీ లేక అసలు ఆ సినిమాలు అనేది వ‌చ్చిన సంగ‌తి కూడా జ‌నాల‌కు తెలీకుండా పోయింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘ఎవ‌డు త‌క్కువ కాదు’. బ‌డా ప్రొడ్యూస‌ర్ ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ కొడుకు విక్ర‌మ్ స‌హ‌దేవ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ త‌మిళ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ కి రీమేక్ గా తెర‌కెక్కిన ఈ సినిమా అనేది ఒక‌టుంద‌ని క‌నీసం ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ను కూడా తెలీదు. సినిమా ప‌రాజ‌యాన్ని పొంద‌డంతో పాటూ, అక్క‌డున్న రానెస్ బోల్డ్ అటెంప్ట్ ని ఇక్క‌డ రీ క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు దానికి తోడు సినిమాకు ప్ర‌మోష‌న్స్ కూడా అంతంత మాత్ర‌మే. ఒక బ‌డా ప్రొడ్యూస‌ర్ అయి ఉండి, త‌న కొడుకు డెబ్యూ మూవీ కి ఇంత నాసి ర‌కం ప్ర‌మోష‌న్స్ చేశాడు. గ‌తంలో పెద్ద పెద్ద హీరోల‌తో సైతం సినిమాలు చేసిన నిర్మాత త‌న కొడుకును ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా నిల‌బెట్ట‌లేక‌పోయాడు. క‌నీసం ప్ర‌మోష‌న్స్ అయినా చేస్తే జ‌నానికి ఈ సినిమా ఒక‌టి ఉంద‌ని రీచ్ అయుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here