‘యాత్ర’ మూవీ రివ్యూ

0
2047

వైఎస్సార్.. పేద ప్ర‌జ‌ల గుండెల్లో ఈ పేరు ఒక చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న పాల‌నలో వ‌చ్చిన చాలా సంక్షేమ ప‌థ‌కాలు ఎంతో మంది జీవితాల‌కు వెలుగు రేఖ‌లుగా నిలిచాయి. ఆ మ‌హానాయ‌కుడి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ‘యాత్ర’ సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రాజ‌న్న పాధ‌యాత్ర నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వైఎస్సార్ బ‌యోపిక్ కావ‌డం, ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర‌వుతున్న నేప‌థ్యంలో ఈ సినిమా రావ‌డం, అన్నింటికీ మించి మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి వైఎస్ పాత్ర‌లో న‌టించ‌డంతో ఈ చిత్రానికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. దానికి తోడు టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు కూడా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి ఇన్ని అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం..

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు పాల‌న‌లో రైతంగ స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూసి చ‌లించిపోయిన వైఎస్సార్ పాద యాత్ర‌కు పూనుకుంటాడు. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటాడు. పాద యాత్ర తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్.. ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయి. తిరిగి రెండోసారి సీఎం అవ్వడం..హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా కన్నుమూసాడనేదే ‘యాత్ర’ స్టోరీ.

యాత్ర లో వైఎస్సార్ పాత్ర‌కు మ‌మ్ముట్టి కాకుండా వేరే న‌టుడిని ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మ‌నే రేంజ్ లో ఒదిగిపోయాడు మ‌మ్ముట్టి. వైఎస్సార్ హావ భావాలు, మొండిత‌నం త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం కంటే అన్ని తానై పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో ఆయ‌న మొండిత‌నం ఎలా ఉండేదో త‌న న‌ట‌న‌తో చూపించాడు. యాత్ర సంద‌ర్భంగా రైతుల క‌ష్టాలు, క‌రెంట్ స‌మ‌స్య‌ల‌పై చ‌లించిపోవ‌డం వంటి ఎమోష‌న‌ల్ సీన్స్ లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. వైఎస్ తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు ఉన్న కాసేపు ఆక‌ట్టుకుంటాడు. రావు ర‌మేష్ మ‌రోసారి త‌న సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. మిగిలిన వారు ఎవ‌రి పాత్రల ప‌రిధి మేర వారు బాగా చేశారు.

‘యాత్ర’ సినిమాకు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి..పాదయాత్రతో ఎలా ముఖ్యమంత్రి కావడం..ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాడనే కాన్సెప్టే ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమాలో వైయస్ పాత్రను మమ్ముట్టి ఒదిగిపోయాడనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో రెబల్‌గా ఆయన నైజాన్ని చూపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు ఎవరు సీఎం అయిన పర్వాలేదు కానీ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాకుడదు. అలా సొంత పార్టీలో విపక్షాన్ని ఎదుర్కొని ఎలా మహానాయకుడుగా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కరెంట్ ఛార్జీలు పెంచినందకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతులపై అప్పటి బాబు గవర్నమెంట్ బషీర్‌బాగ్‌లో కాల్పులు జరపించిండం ఈ సినిమాకు హైలెట్. పాదయాత్ర నేపథ్యంలో కరెంటు ఛార్జీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం..ఈ కోవలోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనే ఆలోచన వైయస్ఆర్‌కు రావడం వంటివి చూపించారు. మరోవైపు ఆరోగ్యం కోసం ప్రజల కష్టాలకు చలించపోయి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలు, డబ్బులు కట్టలేక పెద్ద చదువులు చదవలేకపోయిన వారికోసం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశం పెట్టడంతో చిన్న, మధ్యతరగతి ప్రజలకు పెద్ద చదువులను దగ్గరచేయడం వంటివి చాలా ఎమోషనల్‌ సీన్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. స్టోరీ, కటెంట్ పరంగా బాగున్నా…ఈ సినిమా నేరేషన్ మాత్రం చాలా స్లో గా సాగ‌డం మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా స‌హ‌జంగా ఉంది. కె అందించిన పాట‌లన్నీ సంద‌ర్భానుసారంగా వ‌చ్చి వెళ్లేవే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. త‌న రీరికార్డింగ్ తో ప్ర‌తీ సీన్ ఎలివేట్ అయ్యేలా చేశాడు కె. ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గట్టు ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
మమ్ముట్టి న‌ట‌న‌
రీరికార్డింగ్
ఎమోష‌న‌ల్ సీన్స్

మైన‌స్ పాయిట్స్ః
స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః యాత్ర‌- గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేరేనా..?
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here