Thursday, May 23, 2019
Home News Entertainment news మార్చి 15న ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు విడుదల..!!

మార్చి 15న ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు విడుదల..!!

0
2529
సినిమా ఇండస్ట్రీ లో ఒకే రోజు ఒకే హీరో కి సంభందించిన రెండు సినిమాలు విడుదల అవడం చాల అరుదుగా జరుగుతుంటుంది.. ప్రస్తుతం పరిస్థితులలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే విడుదల చేస్తున్న తరుణంలో యంగ్ హీరో రామ్ కార్తిక్ ఒకే రోజున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. అయన నటించిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘మౌనమే ఇష్టం’ చిత్రాలు మార్చి 15 న విడుదల అవుతున్నాయి… రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రామ్ కార్తిక్ హీరో గా కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిపై ఇప్పటికే మంచి అంచనాలుండగా, మౌనమే ఇష్టం లాంటి యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి..
దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్‌ గెలుచుకున్న అశోక్‌ కుమార్‌ తొలిసారి ‘మౌనమే ఇష్టం’ సినిమా కు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. ఇక టీజర్ , ట్రైలర్ తో విశేష స్పందన దక్కించుకున్న వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి లో రామ్ కార్తీక్ సరసన పూజిత పొన్నాడ నటించగా , మౌనమే ఇష్టం సినిమా లో రామ్ కార్తీక్ సరసన పార్వతి అరుణ్, రీతూచౌదరి హీరోయిన్లుగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here