సీక్వెల్ సినిమాలకు సిద్ధం అంటున్నవిశాల్

0
208
తమిళనాట మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన విశాల్, వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన సుందర్.సి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు) సినిమాకి సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీవసూళ్లను సాధించింది. సీక్వెల్ కి మిత్రన్ కాకుండా ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించనుండటం విశేషం.
ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇంతకుముందు విశాల్ చేసిన ‘తుప్పరివాలన్’ (డిటెక్టివ్) కూడా రెండు భాషల్లోను విజయాలను అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘తుప్పరివాలన్ 2’ పేరుతో ఈ సినిమా నిర్మితం కానుంది. దర్శకుడు ‘మిస్కిన్’ ఇటీవలే విశాల్ ను కలిసి కథ వినిపించడం .. విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. మొత్తానికి సీక్వెల్స్ పైనే విశాల్ ప్రత్యేక దృష్టిపెట్టాడన్న మాట.