విక్ర‌మ్ వేద రీమేక్ వార్త‌లు నిజం కాద‌ని తేల్చేసిన‌ నిర్మాతలు

0
2789
2017లో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్ లో వ‌చ్చిన త‌మిళ చిత్రం విక్ర‌మ్ వేద బాక్సాఫీస్ వద్ద విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టులుగా వారిద్ద‌రికీ మంచి పేరును కూడా సంపాదించి పెట్టింది. ఎప్ప‌టి నుంచో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నార‌ని వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మొద‌ట్లో ఈ రీమేక్ లో నాగార్జున‌, వెంకటేస్, మాధ‌వ‌న్, రానా ల‌లో ఏ ఇద్ద‌రైనా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లొచ్చాయి, కానీ త‌ర్వాత్త‌ర్వాత ఆ ప్లేస్ లోకి బాల‌కృష్ణ‌, రాజ శేఖ‌ర్ లు రీప్లేస్ అయ్యార‌ని వార్త‌లొచ్చాయి. బాల‌య్య ఇందులో గ్యాంగ్‌స్ట‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌నీ, రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌నీ, ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి తో చేస్తున్న సినిమా, రాజ‌శేఖ‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తో చేస్తున్న క‌ల్కి సినిమాలు అయిపోగానే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌న్న వార్త‌ సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తుంది.
అయితే ఇప్పుడు ఈ వార్త‌ల‌న్నింటికీ చెక్ పెడుతూ విక్ర‌మ్ వేద నిర్మాత‌లు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. విక్ర‌మ్ వేద తెలుగు రీమేక్ కు సంబంధించి వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేదనీ, ఈ సినిమా రీమేక్ హ‌క్కులు ఇప్ప‌టికీ త‌మ ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని, ద‌య‌చేసి ఇలాంటి నిజం లేని వార్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌నీ, త్వ‌ర‌లోనే మేం ఈ విష‌యానికి సంబంధించి అఫీషియ‌ల్ గా అనౌన్స్‌మెంట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.