Thursday, May 23, 2019
Home News Entertainment news విజయ్ ‘బంగారుకొండ’ అవుతున్నాడుగా

విజయ్ ‘బంగారుకొండ’ అవుతున్నాడుగా

0
2541
విజయ్ దేవరకొండ.. మనోడి రేంజ్ ఎప్పుడో మారింది. ఇలా అతి తక్కువ టైమ్ లోనే ఈ రేంజ్ కు వచ్చిన స్టార్స్ ను ఈ మధ్య మనం టాలీవుడ్ లో చూడలేదు. అది కూడా ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ ఆర్టిస్ట్. మొత్తంగా విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతున్నాడు. అర్జున్ రెడ్డితో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అతను గీత గోవిందంతో వంద కోట్లు కొల్లగొట్టి నిర్మాతల పాలిట బంగారు కొండ అవుతున్నాడు. అతని పర్సనాలిటీ కూడా అన్ని కథలకు సెట్ అవుతుంది. అర్జున్ రెడ్డిలో రెబల్ గా ఎంత మెప్పించాడో.. గీత గోవిందంలో పిరికివాడుగా అంత ఆకట్టుకున్నాడు. ఇదే ఇప్పుడు చాలామంది దర్శకులు విజయ్ దేవరకొండ టార్గెట్ గా కథలు రాసుకునేలా చేస్తోంది. ఈ క్రమంలో అతన్నుంచి వస్తోన్న ఓ వార్త ఖచ్చితంగా విజయ్ దేవరకొండ రేంజ్ ఎంత పెరిగింది అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ప్రస్తుతం చాలా పెద్ద బ్యానర్స్ విజయ్ దేవరకొం కోసం చూస్తున్నాయి. వీటిలో మైత్రీ మూవీస్ ఒకటి. చాలా వేగంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తూ విడుదల చేస్తోన్న మైత్రీ మూవీస్ తమ నెక్ట్స్ సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అయితే ఆల్రెడీ విజయ్ తో ఓ సినిమా చేశారు కాబట్టి ఇందులో పెద్ద వింతేముందీ అనుకోవచ్చు. కానీ ఉంది. అదేంటో తెలుసా.. ఈ సినిమాను ఏకంగా 9 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ సంస్థే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

ఇప్పటికే బాహుబలి తర్వాత ఒకేసారి సౌత్ లోని నాలుగు భాషల్లో విడుదల కాబోతోన్న సినిమాగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా తొమ్మిది భాషల్లో అంటే ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క బాహుబలికి తప్ప మరే హీరోకూ సాధ్యం కాని ఫీట్ ఇది. ఏదేమైనా తనదైన శైలిలో విజయ్ దేవరకొండ రోజురోజుకూ రేంజ్ పెంచుకుంటూ నిర్మాతలకు బంగారు కొండలా మారుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here