మీకు ఇదే స‌రైన స‌మ‌యం పండ‌గ చేస్కోండి – విజ‌య్ దేవ‌ర‌కొండ‌

0
218
 పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి విభిన్న‌మైన చిత్రాల‌తో తెలుగులో సెన్సేష‌న్ హీరో అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ‘నోటా’ తో త‌మిళనాట త‌న అదృష్టంన‌ను ప‌రీక్షించుకుందామ‌ని ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఆశించిన స్థాయిలో నోటా ఆక‌ట్టుకోలేక‌పోయింది. త‌న‌కున్న క్రేజ్ వ‌ల్ల మంచి ఓపెనింగ్స్ అయితే వ‌చ్చాయి కానీ త‌ర్వాత రోజు నుంచి క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయి, సినిమా ఫెయిల్ అయింద‌ని తేలిపోయింది. నోటాకు ఫ్లాప్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో విజ‌య్ త‌న ఫ్యాన్స్ తో పాటూ, యాంటీ ఫ్యాన్స్ కు ఓపెన్ లెట‌ర్ రాసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ లెట‌ర్ లో నోటా చిత్రాన్ని చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా ఈ చిత్ర ఫెయిల్యూర్ బాధ్య‌త మొత్తం నాదే అంటూ, సినిమాను ఆద‌రించిన ప్ర‌తీ ప్రేక్ష‌కుడి ప్రేమ‌ను తీసుకుంటున్నా. ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన నా యాటిట్యూడ్ లో మార్పుండ‌దు. ఒక విజ‌యయో, అప‌జ‌య‌మో రౌడీని త‌యారు చేయ‌లేదు, ప‌డ‌గొట్ట‌లేదు. రౌడీ అంటే కేవ‌లం గెల‌వ‌డం మాత్ర‌మే కాదని న‌మ్ముతా. విజ‌యం కోసం పోరాడే వ్య‌క్తే రౌడీ అనుకుంటా నేను. రౌడీలు అయినందుకు మ‌నం గ‌ర్వ‌ప‌డ‌దాం గెలుపుకోసం పోరాటం చేద్దాం. గెలిస్తే మంచిది లేదంటే ఏదైనా విష‌యం నేర్చుకుంటాం అంతే కానీ ప్ర‌య‌త్నం మాత్రం ఆపేయం. నా ఫెయిల్యూర్ ను ఎంజాయ్ చేస్తున్న వారికి ఇదే మంచి టైమ్ పండ‌గ చేస్కోండి. మ‌రోసారి ఇలాంటి ఛాన్స్ మీకు రాదేమో, మ‌రో సినిమాతో వెంట‌నే మీ ముందుకొస్తా అంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. నోటా ఫ్లాప్ అయినా కానీ మళ్లీ తర్వాత సినిమాతో ఒక మంచి విజ‌యాన్ని ఫ్యాన్స్ కు ఇస్తాన‌నే న‌మ్మ‌కంతో దేవ‌ర‌కొండ ఉన్నాడు. త్వ‌ర‌లోనే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో విజ‌య్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here