వెంకీ ఇరగదీశాడుగా

0
128
కొన్నిసార్లు అంతే.. టైమింగ్ ఉన్నోడికి టైమ్ కలిసొస్తే ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో విక్టరీ వెంకటేష్ మరోసారి ప్రూవ్ చేశాడు. ఇవాళ విడుదలైన ‘ఎఫ్ -2’లో వెంకీ హంగామా చూసి ఆయన ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. విక్టరీ ఈజ్ బ్యాక్ అంటూ ఊగిపోతున్నారు. వెంకటేష్ కూడా చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. మళ్లీ నువ్వునాకు నచ్చావ్ టైమ్ లో చూసిన వెంకీని గుర్తు చేశాడు. ఫస్ట్ హాఫ్ లో తన కామెడీ టైమింగ్ తో ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడని చెప్పొచ్చు. తమన్నాతో పాటు అన్నపూర్ణ, వై విజయల కాంబినేషన్ లో సీన్స్ లో అయితే విక్టరీ హిలేరియస్ గా నవ్వులు పంచాడు.
ఇక ఎఫ్ -2 కు మంచి టాక్ వస్తోంది. దీంతో ఇక వెంకీ పని అయిపోయింది అన్నవాళ్లు మూసుకోవచ్చేమో రూమర్స్. అలాగే అతను త్వరలో చేయబోతోన్న వెంకీ మామతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కు కూడా ఈ విజయం కొత్త జోష్ నిస్తుందని చెప్పొచ్చు. అసలు వెంకటేష్ వంటి టైమింగ్ ఆర్టిస్ట్ ను సరిగ్గా వాడుకుంటే అతనెంత బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడో మరోసారి ప్రూవ్ చేశాడు. ఏదేమైనా ఎఫ్ -2లో వెంకీని చూసిన వాళ్లంతా ఇరగదీశాడు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ వెంకటేష్ వంటీ సీనియర్ కు ఏ మాత్రం తగ్గకుండా వరుణ్ తేజ్ కూడా ఈజ్ తో ఇరగదీశాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here