‘వీర భోగ వ‌సంత రాయ‌లు’ మూవీ రివ్యూ

0
127

భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ కెరీర్ కొన‌సాగిస్తున్న నారా రోహిత్.. శ్రీవిష్ణు, సుధీర్ బాబుల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కిన సినిమా ‘వీర భోగ వ‌సంత రాయులు’. మ‌రి ఈ ముగ్గురి ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందో చూద్దాం.

క‌థః
ఓ చిన్న కుర్రాడు(చరిత్ మానస్) తన ఇల్లు కనపడట్లేదంటూ పోలీస్ స్టేషన్ లో అడుగుపెడతాడు.. ఇల్లుతో పాటు తన తల్లితండ్రులు కూడా కనిపించట్లేదని పోలీసులకు తెలియజేస్తాడు. ఈ ఆసక్తికరమైన కేసును టేకప్ చేస్తాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్(సుధీర్ బాబు). అలాగే 300 ప్రముఖులు ఉన్న ఫ్లైట్ హైజాక్ అవుతుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రంగంలోకి దిగుతాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ రెడ్డి(నారా రోహిత్). ఈ కేసులో భాగంగా దీపక్ రెడ్డికి నీలిమ(శ్రియ శరన్) అనే మరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పరిచయం అవుతుంది.
మరోవైపు సిటీలో స్కూల్ వయసులో ఉన్న అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. అయితే ఈ మూడు సంఘటనల వెనుక ఉన్నది వీర భోగ వసంత రాయలు (శ్రీవిష్ణు) అని తెలుస్తుంది. అతని అదుపులో ఉన్న 300 బందీలు విడిచిపెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఒక టాస్క్ ఇస్తాడు వసంతరాయులు. మరోవైపు అనుమానాస్పద హత్యలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అసలింతకీ వీర భోగ వసంత రాయులు ఎవరు.. అతని కథేంటి..? అన్ని సంఘటనలకి అతనే కారణమా? చివరికి ఇన్వెస్టిగేషన్ టీం అతన్ని పట్టుకోగాలిగిందా అనేది మిగతా కథ.

న‌టీన‌టుల ప్ర‌తిభః
ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ గా నారా రోహిత్ ఎప్ప‌టిలాగే ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయాడు. కొత్త మేకోవ‌ర్, పెర్ఫామెన్స్ తో శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. సుధీర్ బాబు ఉన్నంత‌లో మెప్పించాడు. కానీ డ‌బ్బింగ్ మాత్రం అస్సలు కుద‌ర‌లేదు. శ్రియ జ‌స్ట్ ఓకే అనిపించింది. సుధీర్ బాబు కొడుకు చ‌రిత్ మాన‌స్ న‌ట‌న బాగుంది. మిగిలిన వారిలో ర‌వి ప్ర‌కాష్, మ‌నోజ్ నందం, శ‌శాంక్ త‌మ త‌మ ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతిక నిపుణులుః
ఇంద్ర సేన స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అస‌లేం చెప్పాల‌నుకున్నాడో, ఏం చెప్పాడో త‌న‌కైనా తెలిసుంటే బాగుండేది. ఉన్న‌దాంట్లో హైలైట్ అంటే సినిమాటోగ్ర‌ఫీనే. ఎస్ వెంక‌ట్, నవీన్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కొన్ని కొన్ని సీన్స్ లో కెమెరా ప‌నిత‌నం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు రీరికార్డింగ్ చాలా ముఖ్యం. మార్క్ కే రాబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద‌గా ఇంపాక్ట్ చూపించ‌లేక‌పోయింది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. కొన్నికొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేయొచ్చు. ఆర్ట్ వ‌ర్క్ చాలా బావుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్లుగానే ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
సినిమాటోగ్ర‌ఫీ
ఆర్ట్ వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్ః
క‌థ‌, క‌థ‌నం
ద‌ర్శ‌క‌త్వం
సంగీతం

పంచ్‌లైన్ః ముగ్గురు హీరోలున్నా మెప్పించ‌లేక‌పోయారు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here