Vajra Kavachadhara Govinda Movie Review

0
765
ముందు క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇచ్చి త‌ర్వాత హీరోగా మారిన స‌ప్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సినిమా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమాను తెర‌కెక్కించిన అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా కామెడీ స్టార్ ను మాస్ హీరోగా మార్చిందా? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.
సోమ‌ల అనే ఊరిలో ఉండే గోవింద్ (స‌ప్త‌గిరి)త‌న గ్రామ ప్ర‌జ‌లు ప‌డే కష్టాలు చూడ‌లేక దొంగ‌గా మార‌తాడు. ఊళ్లో ఒక్కొక్క‌రు క్యాన్స‌ర్ తో చ‌నిపోతుండ‌టంతో వారిని కాపాడేందుకు చాలా డ‌బ్బు కావాల‌నే ఉద్దేశ్యంతో ఒక నిధిని వెతికేందుకు కొంత‌మందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్ర‌య‌త్నంలో వారికి 150 కోట్ల విలువైన వ‌జ్రం దొర‌కుతుంది. ఆ వజ్రాన్ని అమ్మి పంచుకోవాల‌నుకుంటారు గోవింద్ బ్యాచ్. ఇదిలా ఉంటే వ‌జ్రాన్ని ఎవ‌రికీ దొర‌క్కుండా దాచిపెట్టిన గోవింద్ ఓ ప్ర‌మాదంలో గ‌తాన్ని మ‌ర్చిపోతాడు. వ‌జ్రాన్ని దాచిన చోటు కూడా మ‌ర్చిపోతాడు. చివ‌ర‌కు గోవింద్ కు గతం గుర్తుకొచ్చి వ‌జ్రాన్ని తీసుకొచ్చాడా? ఊరి ప్ర‌జ‌ల క‌ష్టాన్ని తీర్చాడా అన్న‌ది మిగతా క‌థ‌.
హీరోగా సప్త‌గిరి ఆడియ‌న్స్ ను ఏమాత్రం క‌న్విన్స్ చేయ‌లేక‌పోయాడు. ఎమోష‌నల సీన్స్ లోనూ, యాక్ష‌న్ సీన్స్ లోనూ, త‌న బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ఏ మాత్రం త‌న‌కు సెట్ అయిన‌ట్లు అనిపించ‌వు. కామెడీ సీన్స్ వ‌ర‌కు ఆకట్టుకున్నా, సినిమా మొత్తాన్ని దాని మీద నిల‌బెట్ట‌డ‌మంటే క‌ష్టం. హీరోయిన్ పాత్ర‌కు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేక‌పోవ‌డంతో వైభ‌వీ జోషికి పెద్ద‌గా న‌టించేందుకు ఏమీ లేక‌పోయింది. లుక్స్ ప‌రంగా కూడా వైభ‌వి ఏమంత ఆక‌ట్టుకోలేదు. విల‌న్ గా జ‌స్ప‌ర్ లుక్ బావుంది. అర్చ‌న, జాన్ కొట్టోలి, టెంప‌ర్ వంశీ, మిగిలిన వారు త‌మ త‌మ ప‌రిధి మేర‌కు ఫ‌ర్వాలేదనిపించారు.

క‌మెడియ‌న్ నుంచి హీరోగా ట‌ర్న్ అయిన స‌ప్త‌గిరికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించిన ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని బాగానే ప‌రీక్షించాడు. సప్త‌గిరి ఇమేజ్ ను ప‌ట్టించుకోకుండా ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్, స్లోమోష‌న్ సాంగ్స్, యాక్ష‌న్ సీన్స్ తో సినిమాను తెర‌కెక్కించాడు. క‌థ‌, స్క్రీన్ ప్లే విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు త‌డబడ్డాడు. హీరో పాత్ర‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్న ద‌ర్శ‌కుడు, అస‌లు క‌థ మొద‌లైన త‌ర్వాత కూడా క‌థనాన్ని నెమ్మ‌దిగా న‌డిపించాడు. హీరో హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, పాట‌లు ఏ మాత్రం ఆస‌క్తిక‌రంగా లేక‌పోగా క‌థ‌కు బ్రేకులు ప‌డ్డ‌ట్లుగా చేశాయి. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఏమంత గొప్ప‌గా లేవు.

ప్ల‌స్ పాయింట్స్ః
అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే కామెడీ సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
స్టోరీ, స్క్రీన్ ప్లే
ఎడిటింగ్‌
నిర్మాణ విలువలు

పంచ్‌లైన్ః ఆక‌ట్టుకోని స‌ప్త‌గిరి ప్ర‌య‌త్నం
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః  2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here