విశాల్ పెళ్లిపై కొత్త ట్విస్ట్ ..?

0
109
కోలీవుడ్ స్టార్ విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఈ మధ్య కాలంలో వినిపిస్తోన్న హాట్ న్యూస్ లో ఇదొకటి. నిజానికి ఈ వార్తలో అబద్ధం లేదు. కానీ కొందరు మరికాస్త అత్యుత్సాహానికి పోయారు. ‘‘ఇదుగో పెళ్లి అంటే అదుగో పిల్ల’’ అన్నట్టుగా విశాల్ చేసుకోబోతోన్న అమ్మాయి ఈవిడే అంటూ ఓ అమ్మాయి ఫోటోతో అతని ఫోటోస్ కు యాడ్ చేసి హల్చల్ చేస్తున్నారు. తను ఫలానా వారి అమ్మాయి అంటూ వార్తలు కూడా క్రియేట్ చేశారు. బట్ ఈ విషయం పై విశాల్ స్పందించాడు. తన పి ఆర్ టీమ్ తో తన పెళ్లికి సంబంధించి వస్తోన్న వార్తలపై స్పందించాడు.
విశాల్ పెళ్లి చేసుకోబోతోన్న మాట నిజం. కానీ మీరు చూపిస్తోన్న అమ్మాయి కాదు. తనెవరో మాకు తెలియదు. అందువల్ల దయచేసి ఆ అమ్మాయి ఫోటోను స్ప్రెడ్ చేయొద్దు. తను ఎవరినిక పెళ్లి చేసుకుంటున్నాడు.. ఎప్పుడు అనే విషయం త్వరలోనే విశాలే ఓ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాడు అంటూ పీఆర్ టీమ్ నుంచి ప్రెస్ కు ఓ నోట్ రిలీజ్ చేశారు. సో.. విశాల్ చేసుకోబోతోన్న అమ్మాయి అంటూ వస్తోన్న ఫోటో అబద్ధం అన్నమాట. మరి ఇకనైనా పాపం ఆ అమ్మాయి ఫోటోను పబ్లిష్ చేయడం ఆపితే మంచిదేమో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here