రేసుగుర్రం విలన్ కూతురు కూడా…

0
1506
రేసుగుర్రంలో మద్దాలి శివరెడ్డి గా విలన్ పాత్రలో ఇరగదీసిన నటుడు గుర్తున్నాడు కదా.. తన పేరు రవికిషన్. భోజ్ పురీ భాషలో తను మెగాస్టార్ లాంటి హీరో. తెలుగులో విలన్ గా పరిచయమైనా అక్కడ అతనికి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అయితే తెలుగులో విలన్ గా చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఇక్కడ వరుసగా అవే పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఓ పెద్ద స్టార్ గా ఉన్న రవికిషన్ కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ మధ్య స్టార్ హీరోలు తమ కూతుళ్ల సినిమా ఎంట్రీస్ గురించి పెద్దగా అడ్డు చెప్పడం లేదు. ఆ లిస్ట్ లోకి రవికిషన్ కూడా చేరాడు.
రవికిషన్ కూతురు పేరు రివా. రివా కొన్నాళ్లుగా హీరోయిన్ కావడం కోసం డ్యాన్స్ తో పాటు నటన కూడా నేర్చుకుంటోందట. తన ఇష్టాన్ని కాదనడం ఇష్టం లేని రవికిషన్ తన కోరికను మన్నించాడు. ‘సాబ్ కుషల్ మంగల్’ అనే సినిమాతో రివా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ హీరో ప్రియాంక్ కు కూడా ఇదే తొలి సినిమా. తను చూడ్డానికి కూడా చాలా బావుంది. మరి ఈ సినిమా హిట్ అయితే తను సౌత్ కూ వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా మన స్టార్ హీరోల మైండ్ సెట్స్ మారుతున్నాయనేదానికి ఇదీ ఓ నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here