”ఇంతలో ఎన్నెన్ని వింతలో” నిర్మాత రామ్మోహనరావు ఇప్పిలి ఇంటర్వూ

inthalo ennenni vinthalo movie has stepped into 2nd week in the hari hara chalana chitra banner which is released on april6th. This movie is getting huge response i both andhra pradesh and telangana. Producer Rammohan Rao was inaugurated the press meet on this occasion.
On this occation Producer Ram Mohan Rao Ippili said that…. team “inthalo ennenni vinthalo” enjoying the film success only beacause of our media friends.
All of our media friends came for the premier show and given their best wishes,senior journalist Pasupuleti Rama Rao Garu sawn our film and given his best wishes.The blessings of the elders like the Pasupuleti Rama Rao Garu are always supposed to be our unit. we have passion in movies so we produced the film,As this movie became a big hit we are so happy. we have done good movie so that we had a support from media,friends and audience with a positive response we are so happy for that. Our movie is incresing theaters day by day.we want to share our happiness with our media and as soon as possible “inthalo ennenni vinthalo” grand sucess meet will be held.And in hari hara chalana chitra banner 2nd movie will be announced as soon as possible. presently enjoying the success of Inthalo Ennenni Vinthalo
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో  హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించిన      చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’.  ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదలయ్యి మంచి మన్ననలను పొందుతూ సక్సెస్ బాటలో పయనిస్తోంది..  ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మీడియా తో ముఖాముఖిలో పాల్గొన్నారు..
ప్ర:  ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు.. ?
స: దర్శకుడు వరప్రసాద్ వరకూటి నా స్నేహితుడు.. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ లో ఇద్దరం కలసి చదువుకున్నాం.. అప్పటినుంచే అతను మాకు మంచి కథలను చెప్పేవాడు.. అతను సినిమా ఫీల్డ్ కు వచ్చాక కూడా మాతో టచ్ లో ఉండేవాడు.. అలా మా జర్నీ మొదలయ్యింది.. అప్పుడే వరప్రసాద్ నాకు ఇంతలో ఎన్నెన్ని వింతలో కథ వినిపించాడు లైన్ చాలా బాగుంది.. మంచి అవకాశం దొరికి అందరూ సహకరిస్తే కథను సినిమాగా మలచాలని బావించాము.. అనుకున్నట్టే అన్నీ కుదిరాయి సినిమా స్టార్ట్ చేసాము.. విడుదల కూడా చేసాము సినిమా సక్సెస్ అయ్యింది.. కథ గురుంచి చెప్పాలంటే.. ఒక నలుగురి కుర్రాళ్లలో ఒకరికి ( హీరో నందు ) నిశ్చితార్థం అవుతుంది  36గంటల్లో పెళ్లి ముహూర్తం..ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు.  ఈలోగా ఆ నలుగురు వివిధ కారణాల చేత సమస్యల్లో ఇరుక్కుపోతారు.. అప్పుడు ఆ పెళ్లి జరిగిందా..? మిగతా ముగ్గురు పెళ్ళికి వచ్చారా..? ఆ సమస్యనుంచి ఎలా బయటపడతారు అనేది చిత్ర కథాశం.. దాన్నే ఉత్కంఠ భరితంగా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు వరప్రసాద్.
ప్ర: థియేటర్ల ఫీడ్ బ్యాక్ ఎలావుంది?
స: చాలా బాగుందండి.. ఈ శనివారానికి 40 థియేటర్ల ను పెంచుతున్నాము.. ముఖ్యంగా బిసి సెంటర్ లో మంచి టాక్ వస్తోంది.. పెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా కథ బాగుండటం తో మంచి పేరువస్తోంది.. చుసిన ప్రతిఒక్కరూ ఎవరూ బాగోలేదని చెప్పడం లేదు.. మౌత్ టాక్ తోనే పబ్లిసిటీ బాగొచ్చింది.. అందరికీ ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా..
ప్ర: థియేటర్లను పెంచాలనే ఆలోచన ఎవరిది..?
స: డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనే నండి.. టాక్ బాగొచ్చింది థియేటర్లను పెంచుదామని అడిగారు సరే అనడం జరిగింది.. ముఖ్యంగా ఆంధ్రాలో రెస్పాన్స్ బాగుంది..
ప్ర: కల్లెక్షన్స్ ఎలా ఉన్నాయి..?
స: సంతృప్తి కరంగా ఉన్నాయండి.. అందరూ మెచ్చుకుంటున్నారు.. చెప్పాలంటే చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది..
ప్ర: సినిమా రిలీజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
స: సినిమాను తీయడం కంటే విడుదల చేయడమే కష్టం అనిపించింది.. పెద్ద సినిమాలను దృష్టిలో  పెట్టుకొని థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.. అందుకే  ఈ సినిమా విడుదల తేదీ కోసం మేము మూడు నెలల పాటు ఎదురుచూసి ఏప్రిల్ 6న మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి ఆ రోజునే విడుదల చేయడం జరిగింది..
ప్ర: మీ సర్కిల్ లో అంటే కుటుంబం, స్నేహితుల నుంచి ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది..?
స: మంచి జాబ్స్ చేసుకోకుండా..  సినిమా ఏంటని మొదట అందరూ అనే వారు,కానీ మేము
మొదటి నుంచీ కథను బాగా నమ్మాము.. ప్రేక్షకులనుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ ను చూసి మంచి సినిమా చేశారని..  కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ మెచ్చుకుంటున్నారు. కథనే నమ్మారని ఇప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు..  చాలా హ్యాపీ గా ఉంది.
ప్ర: మీ స్వస్థలం ఎక్కడ.. మీరు వృత్తి ఏంటి ?
స:  మాది శ్రీకాకుళం. మా పాట్నర్ ఒంగోలు వాసి.. నేను జీ.వి.కె. బయో లో జూనియర్ సైన్టిస్ట్ గా చేసున్నా.. ప్రస్తుతానికి సెలవులో ఉన్నాను.
ప్ర: ఒక ఆడియన్ గా మీకెలా అనిపించింది ఈ సినిమా..?
స: తాళిబొట్టు తీసేసే సీన్, తారా తిరిగివచ్చే సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి..
ప్ర: ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతారా..?
స: మంచి కథ లు దొరికితే తప్పకుండా చేస్తాము.. మా బ్యానర్ లో తప్పకుండా మరో మంచి సినిమా ఉంటుంది.. ఆ వివరాలన్నీ అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాము.. మంచి సినిమాలనే తీయాలనే కాన్సెప్ట్ తో వచ్చాము అవే తీస్తాము..
ప్ర: పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారా..?
స:ఇప్పుడు మంచి టీమ్ దొరికింది మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.. హ్యాపీ. పెద్ద హీరోలతో అంటే అదృష్టం అవకాశం  కలసి వస్తే తీస్తాము.. బాలయ్య తో సినిమా చేయాలనే ఆలోచన ఉంది కానీ అది అత్యాశే అవుతుందని భావిస్తున్నా… ప్రస్తుతానికి  ఇలానే సంతృప్తితో ఉన్నాము(నవ్వుతూ) అంటూ ముఖాముఖిని ముగించారు నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి.
హరి హర చలనచిత్ర బ్యానర్ లో మొదటి హిట్  కి సపోర్ట్ చేసింది మా మీడియా మిత్రులే….  నిర్మాత  రామ్మోహన్ రావు ఇప్పిలి 
హరి హర చలన చిత్ర పతాకం పై ఈ నెల 6న విడుదలైన చిత్రం ” ఇంతలో ఎన్నెన్ని వింతలో” ఈ చిత్రం విడుదలై 2వ వారం లోకి అడుగుపెటింది. ఇప్పటికి అన్ని చోట్లా ప్రేక్షదారణ  పొందుతుంది. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు ఇప్పిలి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మాట్లాడుతూ…
ముందుగా మా హరి హర చలనచిత్ర బ్యానర్ లో మొదటి చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో” హిట్ ని మేము ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాము, అంటే దానికి ముఖ్య కారణం మా మీడియా మిత్రులే అని నిస్సందేహం గా చెప్పుకొంటాము. మీరు అందరూ మీడియా ప్రీమియర్ షో కి వచ్చి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్సు ఇవ్వడం, సినీయర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు మా సినిమా పూర్తిగా చూసి మా యూనిట్ ని ఆశీర్వదించడం మాకు అతి పేద్ద కంప్లిమెంట్ గా భావించము. పసుపులేటి రామారావు గారిలాంటి పెద్దల ఆశీర్వాదాలు మా యూనిట్ కి ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాము.
సినిమాలు అంటే  ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము,మాకు ఈ చిత్ర విజయం తో మాకు సినిమా పట్ల ఉన్న  ఇష్టం మరింత పెరిగింది. మంచి సినిమాను తీస్తే మీడియా సపోర్ట్, అలానే ప్రేక్షకుల నుండి ఫ్రెండ్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతషం గా ఉంది.
ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను.
మా చిత్రం ఇప్పటికీ థియేటర్స్ సంఖ్య పెరుగుతున్నాయి.ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకోడం కోసం మా పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసాము త్వరలోనే “ఇంతలో ఎన్నెని వింతలో” మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్ పెడుతున్నాము. అని తెలియ చేస్తూ మా హరిహర చలనచిత్ర బ్యానర్ లో 2వ ప్రాజెక్ట్ ని కుడా త్వరలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు “ఇంతలో ఎన్నెని వింతలో” సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని చెబుతూ ఒక మీడియా మిత్రుడు మీ బ్యానర్ లో ఎ హీరోలతో సినిమాలు తియ్యాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఆశ అనుకుంటే శ్రీ విష్ణు అత్యాశ అనుకుంటే  బాలయ్య బాబు గారితో అని యువ నిర్మాత రామ్మోహనరావు ఇప్పిలి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *