త‌స్సాదియ్యా.. అంటూ అంచ‌నాలు పెంచేసిన చెర్రీ

0
338

రంగ‌స్థ‌లం లాంటి ఇండ‌స్ట్రీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ త‌ర్వాత రామ్ చ‌రణ్ న‌టిస్తున్న విన‌య విధేయ రామ ప్ర‌మోష‌న్స్ తో జోరు పెంచింది. మొన్నీ మ‌ధ్యే వ‌చ్చిన ఫ్యామిలీ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన త‌ర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ కు కావాల్సిన జోష్ లో ఉన్న పాట‌ను రిలీజ్ చేసింది టీమ్. త‌స్సాదియ్యా అంటూ శ్రీ మ‌ణి లిరిక్స్ అందించ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన ట్యూన్ మాస్ తో పాటూ అభిమానుల‌కు సైతం ఇన్‌స్టాంట్ గా క‌నెక్ట్ అయ్యేలా ఉంది. ట్యూన్ మ‌రీ కొత్త‌గా లేక‌పోయినా కానీ యాక్ష‌న్ బేస్డ్ డ్రామా కాబ‌ట్టి ఇలాంటి సినిమాలకు ఈ టైప్ పాట‌లైతేనే స‌రిగ్గా సెట్ట‌వుతాయి. లైలా మజ్నులతో పోలికలు మొదలుపెట్టి ప్రేమికులు ఎలా ఉండకూడదో వివరిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని హీరో హీరోయిన్లు ఒకరికి ఒకరు టీజ్ చేసుకుంటూ పాడటం బాగుంది.

త‌స్సాదియ్యా అంటూ అంచ‌నాలు పెంచేసిన చెర్రీ

దీంతో పాటూ ఇంకా చాలానే ఎట్రాక్ష‌న్స్ తో ఈ లిరిక‌ల్ వీడియో ఉంది. సెట్స్ లో సాంగ్ షూటింగ్ లో చ‌ర‌ణ్ ప్రాక్టీస్ చేస్తున్న స్టెప్స్ ను బిట్స్ రూపంలో చూపించిన విధానం, కియారా అద్వానీ గ్లామ‌ర్, రామ్ చ‌ర‌ణ్ గ్రేస్ ఇవ‌న్నీ ఈ సాంగ్ మీద హైప్ ను ఎక్కువయ్యేలా చేసాయి. అంతే కాదు ఈ పాట షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి వచ్చి చూసి స్వయంగా సలహాలు ఇచ్చిన బిట్ కూడా ఇందులో చూపించ‌డంత వినడానికే కాదు చూసేందుకు కూడా కలర్ ఫుల్ గా మారిపోయింది ఈ లిరికల్. జస్ప్రీత్ జాజ్-మానసి గాత్రం మంచి జోష్ ఇచ్చింది. ఇప్పటికే అంచనాలు హైలో ఉండగా వాటిని రెట్టింపు చేసేలా ఉన్న ఈ తస్సాదియ్యాతో ఫ్యాన్స్ ఆనందం మ‌రింత ఎక్కువైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here