'వెళ్లిపోమాకే' ట్రైల‌ర్ టాక్


దిల్ రాజు చేతిలో ఒక సినిమా పడిదంటే ఆ సినిమా స్థాయే మారిపోతుంది. అప్ప‌టివ‌ర‌కు ఏ ర‌క‌మైన బ‌జ్ లేక‌పోయినా, దిల్ రాజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆ సినిమాకు మామూలుగానే క్రేజ్ వ‌స్తుంది. అలా దిల్ రాజుకు న‌చ్చి త‌న బ్యాన‌ర్ మీద రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్న సినిమా వెళ్లిపోమాకే. ఈ సినిమా గురించి ముందెవ‌రికీ తెలీక‌పోయినా, దిల్ రాజు రిలీజ్ బాధ్య‌త‌లు తీసుకున్నాక, ఆ సినిమా జ‌నాల్లోకి బాగానే వెళ్లింది.ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను దిల్ రాజు రిలీజ్ చేశాడు.


ట్రైల‌ర్ గురించి చెప్పాలంటే, ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేసే ఇంట్రావ‌ర్ట్ నేచుర్ ఉన్న అబ్బాయికి, కంపెనీలో కొత్త‌గా జాయిన్ అయిన అమ్మాయితో ప‌రిచ‌యం మొద‌ల‌వుతుంది. ఇదిలా ఉంటే, ఇంకో అమ్మాయి కూడా ఆ అబ్బాయికి ద‌గ్గ‌ర‌వుతుంది. అస‌లు ఈ ఇద్ద‌రి అమ్మాయిల‌ను ఇంట్రావ‌ర్ట్ అయిన ఆ అబ్బాయి ఎలా మెయింటైన్ చేశాడు, ఆ అమ్మాయిల‌తో జ‌ర్నీ ఎలా సాగింది అన్న దానిమీదే క‌థ మొత్తం న‌డిచేలా ఉంది. సినిమా క‌థ మొత్తం మామూలుగానే ఉన్నా, ట్రైల‌ర్ చూస్తున్నంత సేపు ఏదో తెలియ‌ని ఫీల్ క్యారీ చేసేలా ట్రైల‌ర్ ను క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఏఆర్ రెహ‌మాన్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ప్ర‌శాంత్  విహారి సంగీతం కూడా సినిమాకు మంచి ఫీల్ ను తీసుకొచ్చింది. చూస్తుంటే, దిల్ రాజు వెళ్లిపోమాకే సినిమా మీద పెట్టుకున్న ఆశ నెర‌వేరే ఛాన్సులు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.